GossipsMCA కు షాక్ ఇచ్చిన అమేజాన్ ప్రైం..!

MCA కు షాక్ ఇచ్చిన అమేజాన్ ప్రైం..!

నాచురల్ స్టార్ నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం డైరక్షన్ లో వచ్చిన సినిమా ఎం.సి.ఏ. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో భూమిక ముఖ్య పాత్ర పోశించింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు సంక్రాంతి సినిమాలు వచ్చినా వాటిని ఎదుర్కుని మరి నిలబడింది.
ఇక ఈ సినిమా కలక్షన్స్ కూడా నిర్మాత డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చి పెట్టాయట. అయితే దిల్ రాజు ఈ సినిమాను అమేజాన్ ప్రైం కు అమ్మేశాడు. వారు సినిమా రిలీజ్ అయ్యి 28 రోజులే అవుతుండగా ఈలోగానే అమేజాన్ ప్రైం వీడియోస్ లో ఫుల్ మూవీ ఉంచేశారు. ప్రీమియం మెంబర్స్ కు ఈ సినిమా చూసే అవకాశం ఉంది.
ఓ పక్క థియేటర్ లో ఇంకా సందడి చేస్తున్న ఈ సినిమాపై ఎం.సి.ఏ థియేటర్ యజమానులే కాదు డిస్ట్రిబ్యూటర్స్ కూడా షాక్ అయ్యారని తెలుస్తుంది. సినిమా ఎప్పుడో లాభాలు తెచ్చినా ఇలా తమ ఆదాయానికి గండి పెడితే ఎలా అన్నట్టుగా మాట్లాడుతున్నారట. అమేజాన్ ప్రైం ఇదవరకు జవాన్ సినిమా కూడా రిలీజ్ అయిన 28 రోజుల్లోనే ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది.http://www.telugulives.com/telugu/jai-simha-10-days-collections/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news