Gossipsప్రభాస్ పై అనుష్క.. పెళ్లికి సెట్ అవదు..!

ప్రభాస్ పై అనుష్క.. పెళ్లికి సెట్ అవదు..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో మేల్ కేటగిరిలో ప్రభాస్.. ఫీమేల్ కేటగిరిలో అనుష్క ఉంటారు. అయితే ఇద్దరు కలిసి పనిచేయడం.. ఇద్దరిది సూపర్ హిట్ కాంబో కావడంతో ఇద్దరికి పెళ్లి అంటూ ఏవేవో వార్తలు రాసేవారు. ఇద్దరి మధ్య ఉన్న చనువు చూస్తే అది నిజమే అని నమ్మేలా ఉంటాయి. అయితే ప్రభాస్ గురించి అనుష్క.. అనుష్క గురించి ప్రభాస్ ఎప్పుడు డైరెక్ట్ గా పెళ్లి విషయం పై ప్రస్థావించింది లేదు.
భాగమతి ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క మాత్రం ప్రభాస్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇద్దరం కలిసి చేసిన సినిమాలు హిట్ అయ్యాయి కాబట్టి ఇద్దరికి అలా లింక్ పెట్టేస్తారని అంటుంది అనుష్క. తనకు ఇంత కీర్తి ప్రతిష్టతలు రాడానికి తెలుగు ప్రజలే అంటుంది అనుష్క. ఇంకా తనకు నచ్చిన వరుడు ఎదురుపడలేదని చెప్పుకొచ్చింది అనుష్క.
పెళ్లి పై అసలు నోరు విప్పని ఈ భామ ఏకంగా నచ్చిన వాడు అంటూ మాటలు చెబుతుంది అంటే దాదాపు పెళ్లి కన్ఫాం చేసుకునే ఆలోచనలోనే ఉన్నట్టు తెలుస్తుంది. మరి అనుష్కను వరించే ఆ వరుడు ఎవరు ఏంటి అన్నది చూడాలి.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news