ఇలియానా ప్రియుడిపై షాకింగ్ న్యూస్‌

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఈ మధ్య కాలంలో అస్సలు కనిపించడమే లేదు. అప్పుడప్పుడు ఫోటోషూట్స్ , సోషల్ మీడియా ద్వారా వార్తలలో నిలుస్తూ వస్తుంది.అయితే ఈ అమ్మడు కొన్నాళ్లుగా ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్(29) తో ప్రేమాయణం నడిపిస్తుందని వార్తలు వచ్చినప్పటికి దీనిపై ఎప్పుడు స్పందించలేదు.

అయితే ఇలియానా అందరిలాంటి నటి కాదు. బాలీవుడ్‌లో ఇతర నటీమణుల్లాగా ఆమె తన ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టలేదు. వీలు చిక్కినప్పుడల్లా తన ప్రేమికుడి ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూనే ఉంది.తాజాగా ఇలియానా మిడ్‌-డే పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తన ప్రియుడి గురించి పలు విషయాలు తెలిపింది. అతని గురించి తరచూ మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని, అతను మామూలుగా ఉండటానికి ఇష్టపడతానని, అతని ప్రైవసీకి భంగం కలిగించకూడదని పెద్ద పెద్ద డైలాగులే చెప్పింది ఈ సుందరి.

Ileana-Dcruzs-Weird-Pose-with-Boy-Friend-Andrew-Kneebone

మరీ ఆండ్రూను ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి తాము సహజీవనంలో గడుపుతూ ఆనందంగా ఉన్నామని, పెళ్లి, సహజీవనానికి మధ్య భేదం చాలా చిన్నదని పేర్కొంది. చిత్ర పరిశ్రమలో నేను 11 ఏళ్లుగా కొనసాగుతున్నాను. ఇక్కడి పని సంస్కృతి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.

నటులుగా మాకు ఎంతో ప్రేమ లభిస్తుంది. అదే సమయంలో కారణం లేకున్నా ఎంతో వ్యతిరేకతను మూటగట్టుకుంటాం. మేం చేసే వ్యాఖ్యలు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఇదంతా ఆండ్ర్యూ భరించాల్సి రావడం సరికాదనేది నా భావన అని ఆమె చెప్పుకొచ్చింది.

36db82f888aacf8261ce4c0006il4