Movies"డిటెక్టివ్‌" రివ్యూ & రేటింగ్

“డిటెక్టివ్‌” రివ్యూ & రేటింగ్

విశాల్ ఇప్పుడు ఈ పేరు సౌత్ ఇండియాలో మార్మోగిపోతోంది. ‘పందెంకోడి’లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకొన్నాడు విశాల్‌.కమర్షియల్ కథలతో పాటు, వైవిధ్యభరిత స్క్రిప్టుల్ని ఎంచుకొంటూ – తన విలక్షణత చూపించుకొంటూ వస్తున్నాడు విశాల్. విశాల్ లేటెస్ట్ సినిమా  `తుప్ప‌రివాల‌న్‌` త‌మిళంలో మంచి విజయాన్ని సాధించింది. తెలుగులో `డిటెక్టివ్‌`గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.మరి… ఈ ‘డిటెక్టివ్‌’ కథేంటి? అతను పరిశోధించిన విషయమేంటి??
క‌థ :

అద్వైత భూషణ్ అలియాస్ ఆది (విశాల్‌) ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌. మను (ప్రసన్న) తన స్నేహితుడు కమ్ అసిస్టెంట్‌. ఆది డ‌బ్బుకు ఏ మాత్రం లొంగ‌డు. ఓసారి ‘నా కుక్కపిల్లని ఎవరో చంపేశారు అంకుల్‌… వాళ్లెవరో కనిపెట్టండి’ అంటూ ఓ బాబు అద్వైత దగ్గరకు వస్తాడు. అతని అమాయకత్వం, కుక్కపిల్లపై తనకున్న ప్రేమ చూసి – ఈ కేసు ఒప్పుకొంటాడు. కుక్కపిల్లని ఎవరు చంపారు? అనే విషయాన్ని కనుక్కొంటూ వెళ్తుంటే… అద్వైతకు కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ప్రమాదాలుగా భ్రమింపచేసిన కొన్ని హత్యలకు ఓ ముఠా కారణమని గ్రహిస్తాడు. ఈ క్ర‌మంలోనే ఆదికి మ‌ల్లిక (అను ఇమ్మాన్యుయేల్‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమెతో పాటు విల‌న్ గ్యాంగ్ మ‌నుషులు కూడా ఒక్కొక్క‌రుగా ప‌రిచ‌య‌మ‌వుతుంటారు. ఈ ‘డిటెక్టివ్‌’ కథేంటి?ఎలా ముగిసింది ? అన్న‌దే ఈ సినిమా.

ఎనాలిసిస్:

విశాల్ కి ఇది కొత్త పాత్ర. చాలా సెటీల్డ్‌గా చేశాడు. ఎంత కొత్త పాత్ర అయినా తెలివైన డిటెక్టివ్‌గా విశాల్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. అను ఇమ్మాన్యుయేల్‌ది చిన్న పాత్రే. అమాయకంగా కనిపించింది.విశాల్‌, అను ఇమ్మాన్యుయేల్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సిచ్యువేష‌న్ కామెడీ బాగుంది. నెగ‌టివ్ షేడ్స్ లో ఆండ్రియా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. మిగిలిన వారంతా తమిళ నటులే. వారి వారి పాత్రల్లో ఇమిడిపోయారు. చైనీస్ రెస్టారంట్‌లో జ‌రిగే ఫైట్‌, పిచ్చావ‌రం నీళ్ల‌ల్లో జ‌రిగే ఫైట్లు హైలైట్‌.

టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. పాటల్లేవు. కానీ నేపథ్య సంగీతం బాగా కుదిరింది. కొన్ని సైంటిఫిక..అంశాలు కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను క‌న్‌ఫ్యూజ్‌కు గురి చేయొచ్చు. డబ్బింగ్ సినిమా అయినా ఆ భావన రాదు. తెలుగు సినిమాలానే అనిపిస్తుంది.
బలాలు:
+ విశాల్ నటన
+ స్క్రీన్‌ప్లే
+ ఉత్కంఠత కలిగించే సన్నివేశాలు
బలహీనతలు:
– రొటీన్ స్టోరీ
– ఓ జోనర్‌కే పరిమితం అవ్వడం

ఫైనల్ వర్డ్ :

ఊపిరి బిగ‌ప‌ట్టి ఆశ్చర్యార్ధకం తో చూసే థ్రిల్ల‌ర్‌ మూవీ

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news