బాల‌య్య ఏంటి ఈ అరాచ‌కం…

సంక్రాంతి బరిలో నిలిచేందుకు రాకెట్ స్పీడ్ తో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న నందమూరి నటసింహం బాలయ్య నటించిన 102  చిత్రం జై సింహా. ఈ సినిమాలో జైసింహా గా బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించబోతున్నారనే సంగతి ఫస్ట్ లుక్ లోనే తెలిసిపోతోంది. సరికొత్త  మీసకట్టుతో బాలయ్య అదరగొట్టేస్తున్నారు. దర్శకుడు కేఎస్ రవికుమార్ బాలకృష్ణ పాత్ర విషయంలో బాగా కేర్ తీసుకున్నట్టు స్పృష్టంగా అర్ధం అవుతోంది.

23380010_1542553685831255_140278324911382030_n

భారీ బడ్జెట్ తో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ కాగా హరిప్రియ, నటాషా దోషి లు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హరిప్రియ, బాలకృష్ణ మధ్య జరిగిన చిత్రీకరణకు సంబందించిన కొన్ని చిత్రాలను హరిప్రియ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ తోపాటు ‘నేను జైసింహా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసినప్పటి ఫోటో ఇది. అలాగే డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారి దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. అంతే కాదు.. ఎంతో పరిజ్ఞానం కలిగిన బాలకృష్ణ గారితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది.

balakrishna1 balakrishna2 balaya

Leave a comment