వారెవా బాహుబలి-2 ఖాతాలో ఎవరు టచ్ చేయలేని రికార్డ్..!

baahubali 2 movie

ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సృష్టించిన సంచలనాలు తెలిసిందే. ప్రాంతీయ సినిమాగా వచ్చిన బాహుబలి-2 దేశం మొత్తం గర్వించ దగ్గ సినిమాగా ప్రచారం చేయబడి ఊహించని రేంజ్ లో కలక్షన్స్ సునామి సృష్టించింది. ఇక రిలీజ్ అయ్యి ఇన్ని రోజులవుతున్నా బాహుబలి రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి.

రీసెంట్ గా బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం బాహుబలి-2 సినిమా మరో అరుదైన రికార్డ్ అందుకుంది. అదేంటి అంటే ఇప్పటిదాకా బాహుబలికి 5 కోట్ల 40 లక్షల 43 వేల టికెట్లు తగినట్లుగా చెప్పుకొచ్చారు. వసూళ్లలోనే కాదు టికెట్లు తెగడంలో కూడా సంవత్సరాలుగా ఉన్న రికార్డులను కొల్లగొడుతుంది బాహుబలి. ఇప్పటిదాకా అత్యధిక టికెట్లు కొల్లగొట్టిన సినిమా హమ్ ఆప్కే హై కౌన్.. ఈ సినిమా దాదాపు 7 కోట్ల 39 లక్షల 67 వేల టికెట్లు తెగేలా చేసింది. ఇక ఈ వరుసలో రెండో స్థానంలో షోలే 5 కోట్ల 52వేల 34 వేల టైకెట్లు సాధించింది.

ఇక అదే క్రమంలో బాహుబలి-2 మూడో స్థానంలో ఉంది. అయితే బాహుబలి-2 చైనాలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ అక్కడ కూడా అనుకున్న సక్సెస్ సాధిస్తే బాహుబలి-2 టికెట్ల రికార్డుల్లో రెండో స్థానంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా ప్రధాన పాత్రలుగా నటించిన బాహుబలి మొదటి రెండు పార్టులు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నో రికార్డులను కొల్లగొట్టి సరికొత్త సంచలనాలు సృష్టించింది.

Leave a comment