Newsనటనలో ఎన్టీఆర్ కేక అంటున్న మలయాళ ముద్దుగుమ్మ ..!

నటనలో ఎన్టీఆర్ కేక అంటున్న మలయాళ ముద్దుగుమ్మ ..!

సౌత్ లో టాప్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా సరే కొత్త హీరోయిన్స్ మాత్రం మలయాళం నుండే వస్తుంటారు. నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ తరం క్రేజీ హీరోయిన్స్ అంతా అక్కడి నుండి వచ్చినవారే. వారిలో జెంటిల్మన్ తో హిట్ అందుకుని మళ్లీ అదే హీరోతో నిన్నుకోరి లో కూడా నటించి మెప్పించిన చిన్నది నివేథా థామస్ కూడా ఒకరు.

తన సహజ నటనతో సూపర్ అనిపించుకున్న నివేథా థామస్ నానితోనే బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకుంది. నటన పరంగా హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు అనేలా చేస్తున్న నివేథా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో రాబోతున్న జై లవ కుశ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. సినిమాలో రాశి ఖన్నాతో పాటుగా నివేథా థామస్ కూడా ఒక హీరోయిన్ గా చేస్తుంది.

ఇక హిట్లు కొట్టడమే కాదు ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కూడా బాగానే జరుపుతున్న నివేథా ఈమధ్యనే తన ట్విట్టర్ లో అభిమానులతో చాట్ చేసింది. నాని ఇష్టమైన నటుడని చెప్పిన నివేథా ఎన్.టి.ఆర్ యాక్టింగ్ కూడా కేక అనేస్తుంది. అయితే హీరోయిన్స్ ఏ సినిమా చేస్తే ఆ హీరోని సూపర్ అనేయడం మాములే. కాని నివేథా మాత్రం ఎన్.టి.ఆర్ నటన కూడా బాగుంటుందని తారక్ అభిమానులను ఇప్పటి నుండే బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె చెప్పినా చెప్పకున్నా తారక్ నటన గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే కదా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news