ఇద్దరు హీరోలు.. ఇద్దరు హీరోయిన్లు కలిసి నటించిన సినిమాలు ఇప్పుడు పెద్దగా రావడం లేదు. కానీ, గతంలో మాత్రం మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వచ్చేవి. జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి అగ్రతార లు.. అప్పట్లో కలిసి నటించేవారు. అదేవిధంగా నేటి తరానికి పెద్దగా తెలియని రాధ, ప్రస్తుతం టీవీ సీరియళ్లతో దూసుకుపోతున్న రాధికలు కూడా కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి. చిరంజీవి సరసన ఈ ఇద్దరు హీరోయిన్లు కలిసి నటించిన సినిమాలు వున్నాయి.
అయితే.. ఒక సందర్భంలో రాధ, రాధికలు కలిసినటించినప్పటికీ.. తర్వాత వీరి మధ్య వివాదం తెరమీదికి వచ్చింది. ఇద్దరి రెమ్యునరేషన్ విషయంలో ఏర్పడిన వివాదం.. తర్వాత కాలంలో చాలా ఏళ్ల పాటు కొనసా గింది. నిజానికి రెమ్యునరేషన్ అనేది .. నిర్మాతతో ముడిపడిన విషయం. దీనిలో హీరోయిన్లకు కానీ, హీరోలకు కానీ ఎలాంటి పాత్ర ఉండదు. కానీ, రాధ, రాధికల విషయంలో మాత్రం కొంత తేడా వచ్చింది. రాధకు ఎక్కువగా రెమ్యునరేషన్ ముట్టజెప్పారనేది అప్పట్లో వినిపించిన టాక్.
నిజానికి ముందుగానే రెమ్యునరేషన్‌పై వీరు చర్చించుకునే సెట్స్‌లోకి అడుగులు వేశారు. అయితే.. ఒకరి రికమెండేషన్‌తో సినిమా అయిపోయిన తర్వాత రాధకు ఎక్కువగా ఇచ్చారని.. తనకు రు. 5 లక్షలు తగ్గించారని.. సినిమాలతో తన పాత్రేఎక్కువగా ఉన్నప్పుడు తనకు అన్యాయం చేయడమేంటని.. రాధిక.. అప్పట్లో నే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌తో ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో వివాదం పెద్దదవుతోందని గ్రహించిన దాసరి నారాయణ రావు.. ఇద్దరినీ పిలిచి పంచాయితీ పెట్టారు. రాధకు ఎక్కువ మొత్తం ఇచ్చిన మాట వాస్తవమేనని నిర్మాత ఒప్పుకొన్నారట. దీంతో దాసరి జోక్యం చేసుకుని.. 3 లక్షలు రాధిక కూడా ఇవ్వాలని చెప్పడం.. నిర్మాత ఒప్పుకోవడం అప్పట్లో సంచలనం.
ఇక, ఆ తర్వాత.. రాధా.. రాధిక కలిసి నటించిన సినిమాలు లేకుండా పోయాయి. ఈ వివాదంతో వారు పరస్పరం.. కూడా చాలా రోజులు మాట్లాడుకోలేదని అంటారు. ఏదేమైనా.. రెమ్యునరేషన్ విషయంలో వివాదాలు.. రావడం. . హీరోలకే కాదు.. హీరోయిన్లకు కూడా ఉండేదని ఈ ఘటన నిరూపించింది.