అన్నగారు ఎన్టీఆర్‌కు జాతకంపై నమ్మకం ఎక్కువ. వాస్తు సహా జాతకాలు, సంప్రదాయ బద్ధంగా జరిగే వివాహాలు అంటే.. అన్నగారికి ఎంతో మక్కువ. తన అభిమాని ఒకరు ఏకంగా.. అన్నగారితో తన కుమార్తెకు వివాహం జరిపించారు. అన్నగారు స్వయంగా మంత్రాలు చదువుతూ.. చేయించిన ఆ వివాహం ఇప్పటికీ.. ఒక రికార్డుగా చెప్పుకొంటారు. వాస్తు, సంప్రదాయం, వివాహాల విషయంలో తిరుపతి వెంకట కవులను సంప్రదించేవారట అన్నగారు. తను హైదరాబాద్‌లో కట్టుకున్న రామకృష్ణా సినీ స్టూడియో వాస్తును గౌరు వెంకటరెడ్డి అనే వాస్తు శిల్పితో నిర్ణయించుకున్నారు.
ఇక, ఇతర పూజా కార్యక్రమాలు అంటే.. గృహప్రవేశం, శంకుస్థాపన వంటి వాటిని మాత్రం తిరుపతి వెంకట కవులతో చేయించా రు. అదేసమయంలో తన జీవితంలో జాతకం అనేది మరింత ఎక్కువగా నమ్మేవారు ఎన్టీఆర్ చిత్రరంగ ప్రవేశానికి ముందు కూడా అన్నగారు జాతకాలు చూపించేవారు. కేవలం తన జాతకమే కాదు.. తన ఇంటిల్లి పాది వ్యక్తుల జాతకాలను కూడా ఆయన రికార్డు చేయించి పెట్టారు.
ఇప్పటికీ.. వీటిని కుటుంబ సభ్యులు ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా జాతకాల విషయంలో అన్నగారు దిగ్దర్శకుడు.. బి. విఠలాచార్య సలహాలు సూచనలు తీసుకునేవారు. ఒక సందర్భంలో విఠలాచార్య.. అన్నగారికి సంచలన విషయం చెప్పారట. నీకు గజారోహణ యోగం ఉంది! అని చెప్పారట. అంటే .. అత్యున్నత స్థానం అధిరోహించడంతోపాటు.. మరింతగా దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నమాట.
అయితే.. అన్నగారు.. అప్పటికే సినిమాలో దూకుడుగా ఉండడంతోపాటు.. మంచి ఫాంలో ఉండడంతో `ఇదే కాబోలు` అని సరిపెట్టుకున్నారు. కానీ, తర్వాత కాలంలో ఆయన రాజకీయాల్లోకి రావడం.. సీఎం కావడం తెలిసిందే. అప్పటికి విఠాలాచార్యకు అన్నగారికి దూరం పెరిగింది. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లను విఠలాచార్య ప్రోత్సహించారు. సినిమా ఖర్చు తగ్గించే ప్రయత్నం చేశారు.
అయినప్పటికీ.. అప్పుడప్పుడు.. ఎన్టీఆర్ ఆయనకు ఫోన్ చేసి మరీ `ఇప్పుడు ఎలా ఉంది మా పరిస్థితి` అని అడిగేవారట. అయితే.. విఠలాచార్య కొన్ని సంగతులు చెప్పలేదు. అదే ద్వితీయ వివాహం వంటివాటిని ఆయన దాచారు. అయితే.. `మగువలకు దూరంగా ఉండండి. ఇది కస్టాలు తెస్తుంది` అని మాత్రం సూచించేవారట. కానీ, అది చెప్పనందువల్లో లేక.. అన్నగారి జాతకమో తెలియదు కానీ.. ఆయన రెండో పెళ్లి చేసుకుని కష్టాలు పడ్డారు.