Moviesవిజయ్ దేవరకొండ "నా బంగారు కొండ".. ఎంత మంచి పని చేసాడో...

విజయ్ దేవరకొండ “నా బంగారు కొండ”.. ఎంత మంచి పని చేసాడో తెలుసా..?

విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెళ్లిచూపులు అనే సినిమాతో క్లాసిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకొని అభిమానులను మెప్పించాడు . పెళ్ళి చూపులు సినిమాతో క్లాసిక్ హీరో అనిపించుకున్న ఈ విజయ్ దేవరకొండ ..ఆ తర్వాత చేసిన అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా యాటిట్యూడ్ హీరోగా మారిపోయాడు .

అర్జున్ రెడ్డి సినిమా సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు . ఇప్పటికీ విజయ్ దేవరకొండ కెరియర్లు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఏంటా అంటే మొదటి వరుసలో ఉండేది అర్జున్ రెడ్డినే. ఈ సినిమాలో ఆయన చేసిన లిప్ లాక్ లు ..ఆయన ఆటిట్యూడ్ .. పొగరు సినిమాకి హైలెట్గా నిలిచింది . కాగా ఈ సినిమా తర్వాత ఆయనకి పర్లేదు అని అనిపించిన సినిమా గీతా గోవిందం. ఈ సినిమాల్లో రష్మిక మందనతో చేసిన రొమాన్స్ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది .

కాగా గీతాగోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు హిట్ పడలేదు . బోలెడన్ని ఆశలతో తెరకెక్కించిన లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ గా నిలిచింది .ఈ క్రమంలోనే ఆయన ఆశలన్నీ తన తదుపరి సినిమా “ఖుషి” పై పెట్టుకొని ఉన్నాడు . అంతేకాకుండా ఈసారి చేసే సినిమాలన్నీ డిఫరెంట్ గా ఉండాలి అంటూ ఫిక్స్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోని తనకి లైఫ్ ఇచ్చిన శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మనకు తెలిసిందే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ పాత్రలో కనిపించి మెప్పించాడు. కాగా ఇప్పుడు ఆ రుణం తీర్చుకోపోతున్నాడు విజయ్ దేవరకొండ . శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఒక క్లాసిక్ లవ్ స్టోరీ లో నటించబోతున్నాడట. శేఖర్ కమ్ముల డైరెక్షన్ అంటే ఫీల్ గుడ్ నో వల్గారిటీ నో వైలెన్స్ అలాంటి కంటెంట్ లో విజయ్ దేవరకొండని చూస్తే కచ్చితంగా ఆయన పైన ఉన్న నెగటివ్ మొత్తం పాజిటివ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి . దీంతో ఒక్కసారిగా అభిమానులు ఆయనను నా బంగారు కొండ అంటూ పొగిడేస్తున్నారు . లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కి హిట్ ఇవ్వబోతున్నాడు అంటూ హైలెట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news