Moviesప్రభాస్ కోసం పొగరెక్కిన బ్యూటీ.. ఇప్పుడు కదా ఫ్యాన్స్ కి అసలైన...

ప్రభాస్ కోసం పొగరెక్కిన బ్యూటీ.. ఇప్పుడు కదా ఫ్యాన్స్ కి అసలైన మజా..!?

ప్రజెంట్.. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన బాధనుండి బయటపడడానికి ట్రై చేస్తున్నాడు . ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా సినిమా షూటింగ్స్ మొదలు పెట్టాలని షెడ్యూల్స్ సరి చేసుకుంటున్నారు. కాగా ప్రజెంట్ షూటింగ్ దశలో ఉన్న సెల్లార్, ప్రాజెక్ట్ కె షూటింగ్ లు పూర్తి అయిపోగానే వెంటనే ప్రభాస్ తెరపైకి తీసుకువచ్చే ప్రాజెక్ట్ మారుతితో నటించబోతున్న కామెడీ ఎంటర్టైనర్. ఎవరు ఊహించని విధంగా మారుతి డైరెక్షన్లో సినిమా చేయడానికి ప్రభాస్ ఒప్పుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఓ విధంగా చెప్పాలంటే ప్రజెంట్ పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ వన్ హీరోగా ఉన్న ప్రభాస్ ఇంత చిన్న డైరెక్టర్ తో సినిమా తీస్తారని ఎవరు ఊహించలేదు .

అయితే కంటెంట్ నచ్చి ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ కృష్ణంరాజు మరణంతో షూటింగ్ పోస్ట్ పోన్ చేశారు మారుతి. కాగా అందుతున్న సమాచారం ప్రకారం దీపావళి తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మొదటి నుంచి ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే .

మొదటిగా మాళవిక మోహన్, రెండోది రాశిఖన్నా, మూడవది మెహ్రీన్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో విలన్ గా కూడా నటించబోయేది ఓ లేడీ అని తాజాగా న్యూస్ మీడియాకు లిక్ అయింది. ఈ క్రమంలోనే ప్రభాస్-మారుతి సినిమా హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచాయి. మనకు తెలిసిందే ఆ లేడి మరెవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. కోలీవుడ్ హీరో శరత్ కుమార్ మొదటి భార్య కూతురే వరలక్ష్మి. ప్రజెంట్ వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో టాప్ మోస్ట్ లేడీ విలన్ గా రాజ్యమేలుతుంది. క్రాక్ సినిమాలో జయమ్మగా ఆమె నటించిన తీరు పొగరెక్కిన బ్యూటీగా ఆమె మాట్లాడిన మాటలు ఇప్పటికీ మర్చిపోలేం . సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వడానికి మొదట కారణం జయమ్మ అని అందరూ అన్నారు.

అయితే ప్రజెంట్ వరలక్ష్మి శరత్ కుమార్ ఎన్.బి.కె 107 సినిమాలో బాలయ్యకు ధీటైనా విలన్ గా నటించబోతుంది. ఇక తర్వాత త్వరలోనే తెరకెక్కబోతున్న కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలోను వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతుంది” అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ప్రభాస్ పక్కన ఇలాంటి పొగరెక్కిన బ్యూటీ విలన్ గా నటిస్తే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇలాంటి హిట్ కోసమే కదా ప్రభాస్ వెయిట్ చేస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి దీనిపై డైరెక్టర్ మారుతి ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news