Movies"ఆయనకి దూరంగా ఉండు" కృతిశెట్టికి మెగా హీరో సలహా..తెర వెనక బిగ్...

“ఆయనకి దూరంగా ఉండు” కృతిశెట్టికి మెగా హీరో సలహా..తెర వెనక బిగ్ సీక్రేట్ లీక్..!?

పాపం.. కృతి శెట్టి తాను ఒకటి తలుచుకుంటే జనాలు మరొకటిగా రిజల్ట్ ఇచ్చారు. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయిన కృతిశెట్టి.. ఆ తర్వాత రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని శభాష్ అనిపించుకుంది. అయితే దీంతో కృతి శెట్టి జాతకం తిరిగిపోయింది అనుకున్నారు . సినీ ఇండస్ట్రీని ఏలేసేది ఈమె అంటూ రాసి పెట్టేసుకున్నారు. అబ్బో అమ్మడుకు ఆఫర్లు కూడా తెగ వచ్చేసేయ్ . ఏకంగా కోలీవుడ్ లోనూ అమ్మడు భారీ సినిమాల్లో నటించే ఛాన్స్ అందుకుంది . దెబ్బకి ఇక టాలీవుడ్ కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది కృతిశెట్టి అంటూ వార్తలు వినిపించాయి.

సీన్ కట్ చేస్తే.. కృతిశెట్టి తర్వాత నటించిన మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా కృతి శెట్టి గ్రాఫ్ డౌన్ ఫాల్ అయింది. ఈ క్రమంలోనే కృతిశెట్టికి వచ్చిన ఆఫర్లు కూడా వెనక్కి వెళ్ళిపోతాయన్న భయం లో వాళ్ళ అమ్మగారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కలవమని సలహా ఇచ్చారట . ఆయనతో అపాయింట్మెంట్ కూడా తీసుకొని కృతశెట్టిని మీట్ అవమని చెప్పారట .అమ్మ మాట కాదనలేక కృతి శెట్టి కూడా వేణు స్వామి కలిసినట్టు కన్నడ మీడియాలో వార్తలు వినిపించాయి.

అయితే కృతశెట్టి వేణు స్వామిని కలిసిన తర్వాత ఆమె జాతకంలో దోషం ఉందని ఆ కారణంగానే తను నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఆమె మిగతా నటించిన సినిమాలకు కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని ఈ క్రమంలోనే ఇంట్లోనే హోమం వేయించుకోమని సలహా ఇచ్చారట. అయితే మెగా ఫ్యామిలీకి మొదటినుంచి వేణు స్వామి అంటే పడని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్లోజ్ ఫ్రెండ్ అయిన మెగా హీరో కృతిశెట్టికి వేణు స్వామిని నమ్మద్దు అంటూ సలహా ఇచ్చారట . “ఆయనకు దూరంగా ఉంటేనే నీకు మంచిది. నీ కెరీర్ కు మంచిది. సినీ ఇండస్ట్రీలో ఆయన అంటే ఎవరికి పడదు. సో నీకు సినిమా అవకాశాలు రావాలన్న నీ లైఫ్ బాగుపడాలన్నా.. వేణు స్వామికి దూరంగా ఉండటమే మంచిది” అంటూ సలహా ఇచ్చారట. ప్రజెంట్ మెగా కాంపౌండ్ లో ఇదే న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news