Moviesదిల్ రాజు లవ్ స్టోరీకి అసలు విలన్ ఆ పెద్దాయనే..షాకింగ్ మ్యాటర్...

దిల్ రాజు లవ్ స్టోరీకి అసలు విలన్ ఆ పెద్దాయనే..షాకింగ్ మ్యాటర్ లీక్..!?

సినీ ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు చాలా కామన్ . ఇప్పటివరకు మనం హీరో హీరోయిన్ల లవ్ స్టోరీలే వింటూ వచ్చాం.. కానీ, ఫస్ట్ టైం ఓ నిర్మాత లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే ఓ చిన్న డిస్ట్రిబ్యూటర్ గా తన కెరియర్ ని ప్రారంభించిన దిల్ రాజు.. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు.

ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్న ఏ సినిమా పోస్ట్ పోన్ అవ్వాలన్న పరోక్షంగా వెనక నుండి నడిపించేదంతా దిల్ రాజునే.. ఈ విషయం అందరికీ తెలిసిందే . ఆయన కథ నమ్మి నిర్మిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. కోట్ల ప్రాఫిట్ తీసుకురావాల్సిందే. అది దిల్ రాజు స్ట్రాటజీ అలా ఉంటది దిల్ రాజు మైండ్ థింకింగ్. కాగా దిల్ రాజు ఈమధ్య ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ సీక్రెట్ చెప్పి సిగ్గు పడిపోయాడు . సరదాగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తూ మాటల మధ్యలో తన లవ్ స్టోరీ ని బయట పెట్టేసిన దిల్ రాజు.. తన మొదటి భార్యని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ మాటలు బట్టి అర్థమవుతుంది.

తన బంధువుల పెళ్లిలో అనితను చూసిన దిల్ రాజు.. కేవలం 45 రోజుల్లోనే తన లవ్ స్టోరీని వాళ్లకు చెప్పేసి ఇంట్లో పెద్దలకు ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారట . కానీ నిశ్చితార్ధానికి పెళ్ళికి దాదాపు 10-11 నెలలు గ్యాప్ పెట్టుకున్నారట. మనకు తెలిసిందే దిల్ రాజు మొదటి భార్య అనిత మరణించిన సంగతి. ఈమె చనిపోయాక వాళ్ళ కూతురు పట్టుబట్టి దిల్ రాజుకు రెండో పెళ్లి చేసింది.ఈ మధ్యనే వీళ్లకు ఓ వారసుడు కూడా పుట్టాడు. దీంతో దిల్ రాజు లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దిల్ రాజు లవ్ స్టోరీ విన్న నెటిజన్స్..ఈయన లవ్ స్టోరీ కి దేవుడే విలన్ గా మారాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చక్కనైన ఆమెను చిన్న వయసులోనే తిరిగిరాని లోకానికి తీసుకెళ్ళిపోయి దిల్ రాజుకు అన్యాయం చేశాడని దిల్ రాజు లైఫ్ లో బిగ్గెస్ట్ విలన్ ఆ దేవుడే అంటూ కొందరు కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news