Moviesబాల‌య్య‌- స‌మంత ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్‌... !

బాల‌య్య‌- స‌మంత ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్‌… !

నంద‌మూరి బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోను సూప‌ర్ హిట్ చేసేశారు. ఒంటి చేత్తో బాల‌య్య ఆ టాక్ షోను న‌డిపించిన తీరుకు జ‌నాలు ఫిదా అయిపోయారు. ఇప్పుడు అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 త్వ‌రలోనే ప్రారంభం కానుంది. అస‌లు ఫ‌స్ట్ సీజ‌న్‌ను బాల‌య్య డ‌బుల్ ఎన‌ర్జీతో న‌డిపించిన తీరుకు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయిపోగా.. ఆహా ఓటీటీకి ఇచ్చిన మైలేజ్ మాత్రం మామూలుగా కాద‌నే చెప్పాలి. అప్ప‌టి వ‌ర‌కు ప‌డుతూ లేస్తూ వ‌చ్చిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ బాల‌య్య షో దెబ్బ‌తో ఎక్క‌డికో వెళ్లిపోయింది.

బాల‌య్య చాలా చాలాకీగా సెల‌బ్రిటీల‌తో సంభాషించిన తీరు, ఆ టాక్ షోను న‌డిపించిన తీరు సూప‌ర్‌. ఇక సీజ‌న్ 1 సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు అంద‌రూ సీజ‌న్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ? అని వెయిట్ చేస్తున్నారు. ఫ‌స్ట్ సీజ‌న్లోనే చాలా మంది సెల‌బ్రిటీల‌ను బాల‌య్య ఇంట‌ర్వ్యూ చేయ‌డంతో పాటువారి నుంచి చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలే రాబ‌ట్టాడు. ముఖ్యంగా మహేష్‌బాబు లాంటి సూప‌ర్‌స్టార్‌ను ఇంట‌ర్వ్యూ చేసిన తీరు బాగుంది.

అలాగే మోహ‌న్‌బాబు ఎపిసోడ్‌తో పాటు మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఎపిసోడ్ కూడా హైలెట్‌. ఇక రెండో సీజ‌న్లో కూడా ఫస్ట్ ఎపిసోడ్లోనే స్టార్ హీరోయిన్ స‌మంత‌ను తీసుకు వ‌స్తున్నార‌ని తెలుస్తోంది. సెకండ్ సీజ‌న్ ఫ‌స్ట్ గెస్ట్ స‌మంతే అట‌. స‌మంత‌కు ఆహాకు మంచి బంధ‌మే ఉంది. గ‌తంలో ఆమె ఆహా కోసం సామ్ జామ్ షో చేసింది. ఆ షోకు పెద్ద‌గా రెస్పాన్స్ రాలేదు.

స‌మంత – బాల‌య్య ఎపిసోడ్ అంటే మామూలు ర‌చ్చ ఉండ‌దు. ఎందుకంటే స‌మంత వ్య‌క్తిగ‌త జీవితంతో పాటు అక్కినేని ఫ్యామిలీ మాజీ కోడ‌లు కావ‌డం, నాగ‌చైత‌న్య‌కు మాజీ భార్య కావ‌డంతో ఆ కోణంలో ప్ర‌శ్న‌లు ఉంటే ఎలాంటి ఆన్స‌ర్లు వ‌స్తాయ‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మే. ఈ ప్ర‌శ్న‌లే ఈ ఎపిసోడ్లో ట్విస్టులుగా ఉంటాయి. ఏదేమైనా స‌మంత – బాల‌య్య ఎపిసోడ్ అప్పుడే హీట్ పుట్టిస్తోంది. ఖ‌చ్చితంగా ఈ ఎపిసోడ్‌తో రేటింగులు పేలిపోవ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news