అన్నగారు.. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఎన్టీఆర్ నటించిన అనేక సాంఘిక చిత్రాలు సూపర్ డూప ర్ హిట్‌లు కొట్టాయి. ఇలాంటి సినిమాల్లో .. సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి వంటివి ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ.. అన్నగారి సరసన.. ప్రముఖ హీరోయిన్.. ఓల్డ్ యాక్ట్రస్.. ఊర్వసి శారద నటించారు. అయితే.. సర్దార్ పాపారాయుడి సినిమాలో కంటే.. జస్టిస్ చౌదరిలో శారద నట విశ్వరూపం చూపించారు.. దర్శకుడు కే. రాఘవేంద్రరావు.
పాపారాయుడు సినిమాను.. దాసరి నారాయణరావు.. దర్శకత్వం చేస్తే.. జస్టిస్ చౌదరి మాత్రం రాఘవేంద్ర రావు సారథ్యంలో తెరమీదికి ఎక్కించారు. వాస్తవానికి ఏహీరోకైనా.. ఉన్నట్టుగా.. అన్నగారికి కూడా టైటిల్ రోల్ పోషిస్తున్నామనే ఆనందం ఉండేది. అయితే.. ఆయన మహిళా రోల్స్ కీలకంగా ఉన్న గుండమ్మ కథ.. వంటి సినిమాల్లోనూ నటించారు. ఎక్కడా.. ఆయన ఇగోలకు పోయేవారు. కానీ, జస్టిస్ చౌదరిలో మాత్రం.. కీ రోల్.. టైటిల్ రోల్ కూడా అన్నగారే పోషించారు.
కథ విన్నారు.. బాగుందన్నారు.. టైటిల్ రోల్ ఇంకా బాగుంటుందని చెప్పారు. అతి తక్కువ సమయంలో కథ విన్నవెంటనే అన్నగారు.. కొబ్బరికాయ కొట్టేశారు. సినిమా విడుదలైంది. 100 రోజులు అనుకున్న సినిమా.. విజయవాడ దుర్గాకళామందిరంలో .. ఏకంగా 250 రోజులు నాలుగు షోల చొప్పున దిగ్విజయంగా ఆడేసింది. దీంతో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఊర్వశి శారద.. అన్నగారు.. ఎన్టీఆర్.. అందరూ వచ్చారు.
అయితే.. ఈ సందర్భంగా.. అన్నగారిని కొందరు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. అయితే.. నటన పరంగా.. ఊర్వశి శారదకు ఎక్కువ పాత్ర ఉందని.. ఆమె నటన అద్భుతంగా ఉందని పలువురు సినీ క్రిటిక్స్ పేర్కొన్నారు. ఇది అన్నగారిని హర్ట్ చేసింది. తనను పొగడలేదని.. కాదు.. ఊర్వశి శారదను పొగిడారని కూడా కాదు. కథలో ఉన్న థీమ్‌ను అర్ధం చేసుకోకుండా.. కేవలం పైపైనే సినిమాను అర్ధం చేసుకున్నారని.. ఆయన ఆవేదన చెందారు.
చాలా సందర్భాల్లో.. జస్టిస్ చౌదరి సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు.. నేటి న్యాయ వ్యవస్థకు ఈ సినిమా ఎంతో ముఖ్యమని అన్నగారు చెప్పేవారు. కానీ, ఆ కోణంలో ఈ సినిమా సమాజంపై ప్రభావం చూపలేక పోయిందనేదే.. అన్నగారి ఆవేదన. ఇటీవల సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.