అనంత శ్రీరామ్..ఈ పేరుకు కొత్త ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈయన ఓ సినీ గీత రచయిత. పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామంలో పుట్టిన ఈఅయన చిన్న వయసు నుండి మ్యూజిక్ అంటే ఇష్టం. ఆ టాలెంట్ ను గమనించిన తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి ఆయనను ప్రోత్సహిస్తూ వచ్చారు. అనంత శ్రీరామ్ తన ప్రాథమిక విద్యను దొడ్డిపట్ల లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడ లోనూ, ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి చేశాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య అనంత్ కు వరుసకు పెదనాన్న అవుతాడు.
సరిగ్గా ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా ఆయన కాలేజీలో ఎక్కువ పాటలు రాసేవాడు..దాని గమనించిన ఫ్రెండ్స్ ఆయనని ఎంకరేజ్ చేసారు. దీంతో పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే తనకు అసలైన సంతృప్తినిస్తాయని భావించి చదువును ఆపేసి..పూర్తిగా మ్యూజిక్ వైపు వచ్చేశాడు. తన సొత టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ..యువతను తన లిరిక్స్ ఉరూతలూగిస్తూ..మ్యూఇక్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. అది క్లాస్ అయినా మాస్ అయినా..అనంత శ్రీరామ్ రాసే లిరిక్స్ చాలా బాగుంటాయి.
12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించిన ఇతనికి మొదటిసారిగా “కాదంటే ఔననిలే” చిత్రంలో అవకాశం లభించింది. దీంతో ఆయన పాటలకు మంచి ఆదరభ లభించింది. ఇప్పటి వరకు ఆయన 570 కి పైగా పాటలు రాశాడు. ఆయన రాసిన అన్ని పాటలు ఆల్ మోస్ట్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ గానే నిలిచాయి. కాగా, ప్రజెంట్ జీ తెలుగు ఛానెల్ లో ఓ సింగింగ్ షో కి జడ్జీగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఎంత ఫేమస్ అయినా కానీ సినీ ఇండస్ట్రీకి ఫ్యామిలీని దూరం పెడుతూనే వచ్చారు. కానీ ఫస్ట్ టైం భార్యను జనాలకు పరిచయం చేశాడు.
జీ తెలుగు ఛానెల్ లో జరగబోతున్న ‘జీ తెలుగు వారి జాతర అందరూ ఆహ్వానితులే’ షోలో ఆయన తన రెండో షేడ్ ను చూయించారు. అస్సలు మనం తెరా పై ఇప్పటి వరకు చూడని కొత్త అనంత శ్రీరామ్ ని చూస్తాం. ఓ విధంగా చెప్పాలంటే అనంత శ్రీరామ్ 2.0 అనే చెప్పాలి. భార్య తో డ్యాన్సులు..చిలిపి అల్లరి..చిందులు..హగ్గులు..అబ్బో నానా హంగామ చేశారు. అంతేకాదు ఈ ప్రోగ్రామ్ లో మర్ కొన్ని సెలబ్రిటీ జంటలు రెచ్చిపోయి మరీ స్టేజీ పైనే ముద్దులతో హీట్ పెంచారు. ఇక వాళ్ళ ఫుల్ పెర్ఫార్మన్స్ మీరు ఆదివారం జీ తెలుగులో చూడొచ్చు. తాజాగా వదిలిన ప్రోమో మాత్రం తెగ వైరల్ అవుతుంది.