Gossipsభానుమతి అలియాస్ సాయి పల్లవి.. షాకింగ్ రెమ్యునరేషన్ ..!

భానుమతి అలియాస్ సాయి పల్లవి.. షాకింగ్ రెమ్యునరేషన్ ..!

మలయాళ ప్రేమం లో మలర్ పాత్రలో నటించి మెప్పించిన సాయి పల్లవి తెలుగులో ఫిదాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. భానుమతి పాత్రకు తనదైన రూపం ఇచ్చిన సాయి పల్లవి ఫిదా ఈ రేంజ్ సక్సెస్ అయ్యిందంటే ఆమె అభినయమే అని చెప్పాల్సిందే. మెడిసిన్ చదువుతూనే సినిమాల మీద మక్కువతో హీరోయిన్ గా మారిన సాయి పల్లవి కేవలం తనకు నచ్చిన పాత్రలనే చేయాలని నిర్ణయించుకుంది.

ప్రేమం తర్వాత కూడా చాలా ఆఫర్లు వచ్చినా ఆచి తూచి అడుగులేసింది. ఇక ఇప్పుడు ఫిదా సక్సెస్ లో ఆమె హీరోయిన్ గా సినిమా తీసేందుకు దర్శక నిర్మాతలు క్యూలో నిలబడ్డారు. ఇక ఈ క్రేజ్ చూసిన సాయి పల్లవి నచ్చిన పాత్రలే చేయాలని పట్టుబడుతున్నా రెమ్యునరేషన్ మాత్రం రెట్టింపు చేసిందని టాక్.

క్రేజ్ ను క్యాష్ చేసుకోవడ హీరోయిన్స్ కు అలవాటే.. అదే దారిలో సాయి పల్లవి కూడా తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు రెమ్యునరేషన్ షాక్ ఇస్తుందట. ఆమె అడిగినంత ఇచ్చి ఆమెను తమ సినిమాలో సెలెక్ట్ చేస్తున్నారట. మొత్తానికి ప్రేమం తో కొంత ఫిదాతో మరికొంత ఇలా ఈ హిట్ క్రేజ్ తో సాయి పల్లవి రేంజ్ ఎక్కడికో వెళ్లిందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news