Moviesఆ హీరోతో కాజల్ ప్రేమ-పెళ్లి..ఒక్క సినిమాతో టోటల్ కొలాప్స్..ఏం జరిగిందంటే..?

ఆ హీరోతో కాజల్ ప్రేమ-పెళ్లి..ఒక్క సినిమాతో టోటల్ కొలాప్స్..ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్..చూడటానికి చక్కటి అందం..ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆ ఫేస్..నటనకు నటన..అన్ని ఆమె సొంతం. నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు..అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా మారిపోవడమే కాకుండా..ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే ఆల్ మోస్ట్ ఆల్ అందరి హీరోల సినిమాలో నటించి ఓ రికర్డ్ తన పేరు మీద రాసిపెట్టుకుంది.

కాజల్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో సినిమా లు చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమా పరంగా అమ్మడు ఫుల్ బిజీ బిజీ గా గడిపేసే టైంలో నే కోలీవుడ్ స్టార్ హీరో తో ప్రేమాయాణం నడిపిందంటూ వార్తలు వినిపించాయి. వీళ్లు కలిసి సినిమా చేస్తున్న టైంలో నే షూటింగ్ టైంలో చాలా క్లోజ్ గా ఉండే వాళ్లని ఒకరు కార్ బ్యాన్ లోకి మరోకరు వెళ్లి గంటలు గంటలు రాకుండా ఉండేవారని..అక్కడ ఇది చూసిన సిబ్బంది..వాళ్ల మధ్య లవ్ కాదు మరేదో సంబంధం ఉందని గుసగుసలాడుకునేవారట.

ఇక్కడ షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే.. ఆ స్టార్ హీరోకి అప్పటికే పెళ్ళి అయ్యింది. కానీ, కూడా కాజల్ ఆయన ఇష్టపడటం ఏంటా అని..కోలీవుడ్ మీడియా ఓపెన్ గానే వార్తలు రాసుకొచ్చింది. దానికి తోడు వీళ్ల మధ్య వచ్చే పుకార్లు చాలావు అన్నట్లు..పలు సార్లు రెస్టారెంట్లకని వెళ్లి నైట్ మీడియా కంట పడ్డారు. ఇక వీళ్ల పెళ్లి దాదాపు జరిగిపోయిన్నట్లే అని ఫిక్స్ అయిపోయారు అంతా. కానీ అదే సంవత్సరం కాజల్ మరో స్టార్ హీరో సినిమాలో నటించిన సినిమా రిలీజ్ అయ్యింది. నిజానికి అది ఎప్పుడో షూట్ చేసిన సినిమా వాయిదాలు పడుతూ లేట్ గా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాలో కొంచెం హీరో తో హాట్ గా కనిపించింది కాజల్.

కానీ ఆ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో అమ్మడు క్రేజ్ ఒకానోక టైం లో పడిపోయింది. దీంతో ఆ కోలీవుడ్ హీరో కూడా అమ్మడిని దూరం పెట్టేశాడని టాక్ వినిపించింది. తప్పు తెలుసుకున్న కాజల్..మళ్ళీ సినిమాల పై దృష్టి సారించి..చిరంజీవి లాంటి హీరో సినిమాలో అవకాశం దక్కించుకుంది. కాగా, కాజల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ మరికొన్ని రోజుల్లోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news