టీడీపీ సీనియర్, నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈఎస్ఐ స్కాంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను రెండు నెలల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన ఏసీబీ కస్టడీలోనే ఉన్నారు. ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రెండు సార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు ఇప్పుడు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది.
ఇక అచ్చెన్నాయుడు పార్టీలోనూ, అసెంబ్లీలోనూ బలమైన వాయిస్ వినిపిస్తూ వైఎస్సార్‌సీపీకి, ముఖ్యమంత్రి జగన్‌కు ఎప్పుడూ కొరకరాని కొయ్యగానే ఉంటున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్న అసెంబ్లీలో లేచి మాట్లాడుతుంటూ వైసీపీ వాళ్లు చేతులు ఎత్తేసే పరిస్థితి. ఇప్పుడు అచ్చెన్నను కావాలనే అరెస్టు చేసి వేధిస్తున్నారని తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది.
ఇక ఈ కేసులో ఏ 1 గా ఉన్న రమేష్ కుమార్ కూడా హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. ఆయనకు బెయిల్ ఇచ్చినా కూడా అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. ఇక ఇప్పటికే అచ్చెన్నను ఏసీబీ అధికారులు విచారించారు. ఆయన ఇప్పుడు అనారోగ్య సమస్యతో గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ కూడా సోకిన సంగతి తెలిసిందే.