Gossipsఆరెక్స్ పాపని దారుణంగా మోసం చేశారట..!

ఆరెక్స్ పాపని దారుణంగా మోసం చేశారట..!

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన పాయల్ రాజ్ పుత్ తెలుగులో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉంది. విక్టరీ వెంకటేష్ తో వెంకీమామ, మాస్ మహరాజ్ రవితేజతో డిస్కో రాజా సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ఈమధ్య వచ్చిన సీత సినిమాలో ఐటం సాంగ్ లో అలరించింది. బాలీవుడ్ సీరియల్స్ చేస్తున్న పాయల్ ను ఆరెక్స్ 100 సినిమాకు సెలెక్ట్ చేసిన డైరక్టర్ అజయ్ భూపతి అమ్మడిని బాగా వాడేశాడని చెప్పొచ్చు.

అయితే ఆ సినిమా తర్వాత పాయల్ కు అదే రకమైన పాత్రలతో సినిమా కథలు వచ్చాయట. అందుకే వాటిని రిజెక్ట్ చేశానని చెప్పింది పాయల్. ఇక లేటెస్ట్ గా అరుంధతి 2లో పాయల్ నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. శ్రీశంఖు చక్ర మూవీస్ బ్యానర్ లో అరుంధతి 2 ఎనౌన్స్ చేశారు నిర్మాతలు. ఆ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు. అయితే అరుంధతి 2 సినిమా కోసం తన దగ్గరకు నిర్మాతలు వచ్చారన్న మాట వాస్తవమే కాని తాను ఆ సినిమాను ఇంకా ఒప్పుకోలేదని చెప్పింది పాయల్.

ఆమె పర్మిషన్ లేకుండానే అరుంధతి 2 లో పాయల్ నటిస్తుందని ఎనౌన్స్ చేశారు. శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా సీక్వల్ చేస్తే గీస్తే ఆయనే చేయాలి. ఇక అనుష్క కూడా ఇప్పటికి మంచి ఫాంలో ఉంది. కచ్చితంగా అరుంధతి 2 అంటూ తీస్తే మళ్లీ అనుష్కతోనే తీయొచ్చు అలాంటిది పాయల్ తో ఈ సినిమా అంటూ ప్రకటించడంతో అందరు షాక్ అయ్యారు. ఈ విషయంపై నిర్మాతల మీద పాయల్ ఫైర్ అవుతుంది. ఆమెతో మాట్లాడి సినిమా ఒప్పుకుందని ప్రకటించడంతో ఆమె హర్ట్ అయ్యిందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news