Gossipsఎన్టీఆర్ , నాని కి చెమటలు పట్టిస్తున్న వెంకటేష్..

ఎన్టీఆర్ , నాని కి చెమటలు పట్టిస్తున్న వెంకటేష్..

బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ ఎవరు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరు చర్చించుకుంటున్న ప్రశ్న ఇదే. బాలీవుడ్ నుండి అన్ని సౌత్ భాషలకు బిగ్ బాస్ ను విస్తరించారు. ఇక తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశాడు. ఎన్.టి.ఆర్ మొదటిసారి బుల్లితెర మీద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని బిగ్ బాస్ షోని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు ఎన్.టి.ఆర్. ఇక సెకండ్ సీజన్ ఎన్.టి.ఆర్ బిజీ అవడం వల్ల నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశాడు.

బిగ్ బాస్ వల్ల నానికి ప్లస్సు మైనస్ అన్నది తెలియదు కాని నాని కూడా తన ఫుల్ ఎఫర్ట్ పెట్టి షోని నడిపించాడు. బిగ్ బాస్ 2 కౌశల్ ఆర్మీ చేసిన ప్రమోషన్స్ వల్ల సీజన్ 2 కూడా సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 కి టైం వచ్చేసింది. ఈ సీజన్ ఎవరు హోస్ట్ గా చేస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఎన్.టి.ఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ 3 వస్తుందని అప్పట్లో అన్నారు కాని హోస్ట్ గా తారక్ కాకుండా ఇప్పుడు సీనియర్ హీరో పేరు వినపడుతుంది. ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ కోసం డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నాడు. రాజమౌళి సినిమా అంటే క్యారక్టర్స్ బయటకు లీక్ అవనివ్వడు. అందుకే ముందు ఎన్.టి.ఆర్ ఓకే అనుకున్నా ఇప్పుడు సారీ చెప్పాడట.

అందుకే విక్టరీ వెంకటేష్ తో బిగ్ బాస్ నిర్వాహకులు చర్చలు జరుపుతున్నారట. వెంకటేష్ హోస్ట్ గా అంటే బిగ్ బాస్ కు మరింత క్రేజ్ వస్తుంది. ఆల్రెడీ సీనియర్ స్టార్స్ నాగార్జున, చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ కు వెంకటేష్ హోస్టింగ్ అంటే కచ్చితంగా కిక్ ఇస్తుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు కాని ఫిల్మ్ నగర్ లో మాత్రం బిగ్ బాస్ 3 హోస్ట్ గా వెంకీ ఫిక్స్ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news