టాలీవుడ్లో దివంగత ఆర్తీ అగర్వాల్ పేరు చెపితే అందరికి తెలిసిన హీరోయిన్. 20 ఏళ్ల క్రితం ఆమె టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగింది. 2001లో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఆమె తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆమె ఇక్కడ ఎదురు లేకుండా పోయింది. వరుస పెట్టి అటు సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు, ఇటు కుర్ర హీరోలకు జోడీగా నటించి ఎన్నో సూపర్ హిట్లు కొట్టింది.
అక్కడ నుంచి కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. అప్పటి యంగ్ హీరో తరుణ్‌తో ఆమె రెండు సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకు తరుణ ఇంట్లో నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. ఆ తర్వాత ఆమె ఫేడవుట్ అయిపోవడం… సినిమా ఛాన్సులు రాక.. చివరకు ఊరూపేరూ లేని సినిమాలు కూడా చేయాల్సి వచ్చింది. అయితే ఆర్తీని టాలీవుడ్ జనాలు ఎలా వాడుకున్నారో ఆమెతో ఓ సినిమా తెరకెక్కించిన దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజేశేఖర్ బయట పెట్టారు.
అమ్మ రాజశేఖర్ టాలీవుడ్లో స్టార్ హీరోలకు మంచి కొరియోగ్రఫీ ఇచ్చారు. సినిమాలో మాస్ సాంగ్ ఉందంటే ఖచ్చితంగా అమ్మ రాజశేఖర్ నృత్యం సమకూర్చాల్సిందే. ఇక క్లైమాక్స్ సాంగ్‌ల కోసం అయితే హీరోలు పనికట్టుకుని మరీ అమ్మ రాజశేఖర్‌నే కొరియోగ్రాఫర్‌గా పెట్టుకునేవారు. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ గోపీచంద్ రణం సినిమాతో మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక టక్కరి, ఖతర్నాక్ సినిమాలు చేసి డిజాస్టర్ ఇచ్చాడు.
తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ఆయన హీరోగా ఓ సినిమా చేశాడు. ఆ సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్. ఆ టైంకు ఆమె ఫేడవుట్ అయిపోయి.. ఎవ్వరూ పెట్టుకోని దీనస్థితిలో ఉంది. ఆ టైంలో ఆర్తీ అమ్మ రాజశేఖర్‌కు తాను ఎలాంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల్లో చేశానని.. ఎందరో స్టార్ హీరోల పక్కన నటించానని.. తనను కొందరు ఎలా దారుణంగా వాడుకున్నారో అమ్మ రాజశేఖర్‌కు చెప్పి భోరున ఏడ్చేసిందట.
ఆ టైంలో నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి రాజశేఖర్ ఆమెను ఓదార్చారట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏదేమైనా ఆర్తీ క్రేజ్‌లో ఉన్నప్పుడు ఆమెను అందరూ బాగా వాడుకున్నారు. ఆమె ఫేడవుట్ అయ్యాక ఆమెను పట్టించుకున్న వాళ్లే లేరు. ఏదేమైనా మరికొంత కాలం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలగాల్సిన ఆర్తీ చిన్న వయస్సులోనే తీరని లోకాలకు వెళ్లిపోయింది.