శివాజీ .. ఈ మధ్యకాలంలో ఈ పేరు ఎలా వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం . ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోగా నటించి ఆ తర్వాత పొలిటికల్ ఇష్యూస్ లో వేలు పెట్టి తన పేరును మారు మ్రోగిపోయేలా చేసుకున్న శివాజీ.. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పార్టిసిపేట్ చేశారు . మైండ్ గేమ్ తో ఆడి విన్నర్ అవ్వాలి అనుకున్న శివాజీ చివర్లో టాప్ 3 స్థానంలో నిచున్నాడు.
కాగా బిగ్ బాస్ తర్వాత వరుసగా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న శివాజీ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫైర్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలపై ఆయన మండిపడ్డారు .”అసలు పాలిటిక్స్ గురించి అడగడం వేస్ట్.. ఒక పార్టీకి ఒక అభ్యర్థి మద్దతు ఇస్తూ ఉంటారు.. అది వాళ్ళ ఒపీనియన్.. వాళ్లంతా కలిసి నియోజకవర్గం లో మంచి అభ్యర్థి కావాలి అనుకుంటారు .
ఈరోజు ప్రజల దగ్గర నుంచి 100 రూపాయలు పెడుతుంటారు . ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 200 లాగేసుకుంటారు. ప్రజల డబ్బుల గురించి రాజకీయ నాయకులు అస్సలు ఆలోచించరు .ప్రస్తుతం సమాజం కూడా బాగోలేదు. ప్రభుత్వం బాగోలేదు అనే హక్కు మీకు ఎక్కడ ఉందిరా పనికిమాలినోల్లారా ..జనాలకు కాస్త అయినా సిగ్గుండాలి “అంటూ శివాజీ ఘాటుగా స్పందించారు . దీంతో ఆయన మాటలు వైరల్ గా మారాయి..!!