తెలుగు సినీ పరిశ్రమలో ఐటెం సాంగ్స్‌లో ఓ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచి అసలు ఐటెం సాంగ్స్‌కే తిరుగులేని క్రేజ్ తీసుకువచ్చిన ఘనత ఖచ్చితంగా సిల్క్ స్మితకే దక్కుతుంది. ఒకానొక టైంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమా ప్రివ్యూ షో చూసిన డిస్ట్రిబ్యూటర్లు సినిమాలో సిల్క్ స్మిత ఉండాల్సిందే అని పట్టుబట్టడంతో కృష్ణ హర్ట్ అయ్యారు. అదేంటి నేను స్టార్ హీరోను…. సిల్క్ స్మిత లేకపోతే సినిమా చూడరా.. హిట్ అవ్వదా అని పట్టుబట్టారు.
అయినా కూడా సిల్క్ స్మిత లేకపోతే సినిమా కొనం అని డిస్ట్రిబ్యూటర్లు పట్టుబట్టకపోవడంతో చివరకు చేసేదేం లేక సిల్క్ స్మిత ఐటెం సాంగ్ పెట్టారు. అది సిల్క్ స్మితకు ఉన్న క్రేజ్. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. అదే పేరుతో వెండితెరకు పరిచయం అయ్యిన తాను అక్కడ నుంచి సిల్క్ స్మితగా ఇండియన్ సినిమాని ఒక ఊపు ఊపేసింది.
ఇదంతా ఆన్ స్క్రీన్ లైఫ్‌లో ఆమె గురించి తెలిసిన విషయం. కానీ ఆమె కెరీర్ పరంగా జరిగిన చాలా విషయాలు చాలా మందికి తెలియదు. ఆ విషయాలు కూడా తెలియజేసే ప్రయత్నంలో భాగంగా దర్శకుడు జయరాం, నిర్మాత ఎస్.బి. విజయ్ కాంబినేషన్లో ఆమె బయోపిక్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. సిల్క్ స్మిత బయోపిక్ టైటిల్ కూడా ఖరారైంది.
ఈ బయోపిక్ కోసం సిల్క్ స్మిత అనే టైటిల్ ఎనౌన్స్ చేశారు. ఈ పాత్ర కోసం రీసెంట్‌గా నటసింహా బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించిన చంద్రిక రవిని ఎంపిక చేశారు. ఆమె సిల్క్ స్మిత పాత్రలో కరెక్టుగా.. పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.