Newsనాని ' హాయ్ నాన్న ' ర‌న్ టైం లాక్‌... క్లీన్...

నాని ‘ హాయ్ నాన్న ‘ ర‌న్ టైం లాక్‌… క్లీన్ యుతో ఎన్ని నిమిషాలంటే…!

నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెర‌కెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ హాయ్ నాన్న‌. నాని కెరీర్‌లో ద‌స‌రా సినిమా ఫ‌స్ట్ రు. 100 కోట్ల సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ద‌స‌రా త‌ర్వాత నాని మార్కెట్ పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకు పోతోంది. ఇప్పుడు నాని న‌టిస్తోన్న హాయ్ నాన్న సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాక కూడా సినిమాపై అంచ‌నాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

నాని కెరీర్‌లో 30వ సినిమాగా హాయ్ నాన్న తెర‌కెక్కుతోంది. కొత్త ద‌ర్శ‌కుడు శౌర్య‌వ్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై బ‌జ్ మామూలుగా లేదు. డిసెంబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్లు మామూలుగా లేవు. ఇటు యానిమ‌ల్ థియేట‌ర్ల‌లో ఉంది. అటు హాయ్ నాన్న సినిమాకు పోటీగా నితిన్ ఎక్స్ ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమా కూడా పోటీలో ఉంది. అయినా కూడా హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తాన‌న్న ధీమాతో నాని ఉన్నాడు.

ఇక ఈ సినిమా ర‌న్ టైం డీటైల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ సినిమా ర‌న్ టైం మొత్తం 2.35 గంట‌లుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ యు స‌ర్టిఫికెట్ అందుకుంది. అంటే మొత్తం 155 నిమిషాల పాటు క్లీన్ యు కంటెంట్‌తో మ‌నం ఈ సినిమాను చూడ‌బోతున్నాం. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌థ బాగా న‌చ్చుతుంద‌ని అంటున్నారు. హాయ్ నాన్న సినిమాకు హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news