సుహాసిని.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల కళ్లముందు ఓ సంప్రదాయ బద్ధమైన మన పక్కింటి అమ్మా యే కళ్ల ముందు కనిపిస్తుంది. పట్టు పరికిణీలో ఉన్న మన దూరపు బంధువుల అమ్మాయే అన్నట్టుగా ఉం టుంది. అలా.. ఏ భాష వారికైనా.. సుహాసిని గుర్తుండి పోతుంది. ప్రస్తుతం ఆమె వయసు 62 సంవత్సరాలు. అయినా.. ఎంతో యాక్టివ్‌గా ఉండే సుహాసిని తన ఇంటికి ఎవరు వచ్చినా.. భోజనం పెట్టకుండా మాత్రం పంపించరట.
1980లలో సినీరంగ ప్రవేశం చేసిన సుహాసినిని బాలచందర్ వంటివారు.. ఆటపట్టించేవారు. ఓ టాలెంట్ లేని అమ్మాయి!` అని పిలిచేవారట. కానీ, సుహాసినిలో టాలెంట్ లేక కాదు.. కానీ.. ఆ రోజుల్లో టాలెంట్ అంటే.. ఎక్స్‌పోజింగ్‌కు మారు పేరు! సుహాసిని ఎప్పుడూ ఏ సినిమాలోనూ ఎక్స్‌పోజ్ చేయలేదు. అలా అడిగిన దర్శకులు కూడా పెద్దగాలేరు. ఒకానొక దశలో నాభి చూపించే పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు కూడా సుహాసినిని ఎవరూ అడగలేదంటే.. ఆమె సాధారణ నటనపై ఉన్న నమ్మకం అలాంటిదని అంటారు.
దర్శకురాలిగా, కథా రచయితగా, నిర్మాతగా, స్క్రీన్‌ప్లే, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలా విభిన్నమైన కోణాల్లో తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సుహాసిని నట జీవితంలో వెనుదిరిగి చూసుకోవా ల్సిన అవసరం లేకుండానే ముందుకు సాగింది. దర్శకుడు మణిరత్నంను ప్రేమించి వివాహం చేసుకు న్న సుహాసినికి దక్షిణాది సినీ పరిశ్రమంలో అత్యుత్తమమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి.
రాక్షసుడు సినిమాతో తెలుగు నాటచిరంజీవితో చేసిన యాక్షన్ మెగా అభిమానులకు ఇప్పటికీ కనువిందే. అలాగే బాలయ్యతో ఆమె ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించినా ఆమెకు ఉన్న పేరు ప్రఖ్యాతులు.. ఆమె సంప్రదాయ బద్ధమైన నటనకు ప్రేక్షకులు ఇప్పటకీ, ఎప్పటకీ ఫిదా అవుతూనే ఉంటారు.