అల్లు అర్జున్ .. ప్రెసెంట్ ఈ పేరు సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో.. పాన్ ఇండియా స్థాయిలో ఎలా వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఆయనకు ఏకంగా జాతీయ అవార్డు వరించింది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో ఆయన పేరు మారు మ్రోగిపోతుంది. రీసెంట్గా మైత్రి మూవీ మేకర్స్ పుష్ప సినిమాకు జాతీయ అవార్డు రావడం పట్ల గ్రాండ్ విందును ఏర్పాటు చేసింది.
ఈ విందులో పాల్గొన్న బన్నీ తన లైఫ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలను షేర్ చేసుకున్నారు . అంతేకాదు దేవిశ్రీప్రసాద్ తో పాటు నేను ఈ అవార్డు తీసుకోవడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు . అంతేకాదు తన ఫ్రెండ్స్ సరదాగా అనే వాళ్లని ..ఎప్పుడూ స్కూల్లో టీసీ లేనా..? ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుకోవా ..? అంటూ నన్ను ఏడిపించే వారని.. అదే నేను బెస్ట్ కాంప్లిమెంట్ గా తీసుకొని ఎలాగైనా అలాంటి డే రావాలని కోరుకున్నానని ..ఫైనల్లీ ఆ రోజు వచ్చేసిందని చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో అవే కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఈ విధంగా తన 20 ఏళ్ల సినీ కెరియర్ లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చింది అని వాళ్ల స్పూర్తితోనే నేషనల్ అవార్డు అందుకోవాలి అనుకున్నానని చెప్పుకొచ్చాడు . అంతేకాదు నాకంటే ఎక్కువగా సుకుమార్ ఈ అవార్డు విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటూ కూడా చెప్పుకొచ్చాడు . ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు సుకుమార్ – బన్నీ.