Newsభ‌గ‌వంత్ కేస‌రి - లియో మ‌ధ్య‌లో న‌లిగిపోతోన్న టైగ‌ర్‌.. ర‌వితేజ సినిమాకు...

భ‌గ‌వంత్ కేస‌రి – లియో మ‌ధ్య‌లో న‌లిగిపోతోన్న టైగ‌ర్‌.. ర‌వితేజ సినిమాకు ఎంత అన్యాయం…!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 20న‌ థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకుని యు / ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న టైగర్ నాగేశ్వర రావు రన్ టైం ఏకంగా 181 నిమిషాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వటానికి ఒకరోజు ముందు బాలయ్య భగవంత్‌ కేసరి, తమిళ హీరో విజయ్ నటించిన లియో సినిమాలు కూడా థియేటర్లోకి దిగుతున్నాయి.

లియో సినిమాకు లోకేష్ కనగ‌రాజ్‌ దర్శకుడు కావడంతో ఈ సినిమాకు తెలుగులోనూ మంచి హైప్‌ ఉంది. గత ఏడాది విక్రమ్ లాంటి సూపర్ హిట్ సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిన లోకేష్ కనగ‌రాజ్ విక్రమ్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా లియో. లియోకు తెలుగులోనే ఏకంగా రు. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీనిని సూర్యదేవర‌ నాగ వంశీ రిలీజ్ చేస్తున్నారు. తమిళనాడులో లియో సినిమాకు దాదాపు అన్ని థియేటర్లు కేటాయించగా.. రవితేజ సినిమాకు 30 లోపు థియేటర్లు మాత్రమే దక్కినట్టు తెలుస్తుంది.

అటు కర్ణాటకలోనూ లియో, భగవంత్‌ కేసరి సినిమాల తర్వాత రవితేజ సినిమాకు పెద్దగా థియేటర్లు ఇవ్వలేదని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రవితేజ సినిమా కంటే లియో సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. లియో డ‌బ్బింగ్ సినిమా… ర‌వితేజ‌ది డైరెక్టు సినిమా. ఏపీ, తెలంగాణ‌లో ఎక్కువ ధియేటర్లు బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాకు ఇవ్వగా.. ఆ తర్వాత లియోకు.. ఇక రవితేజ సినిమాకు లియో కంటే తక్కువగా థియేటర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.

అటు త‌మిళంలో ర‌వితేజ సినిమాకు కేవ‌లం 30 థియేట‌ర్లు ఇచ్చారు. ఇటు తెలుగులోనూ ఇక్క‌డ ర‌వితేజ సినిమా కంటే లియోకు ఎక్కువ థియేట‌ర్లు ఇవ్వ‌డంతో మ‌న డిస్ట్రిబ్యూట‌ర్లు ఎంత ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో రవితేజ అభిమానులతో పాటు ఈ సినిమాకి కొన్న డిస్ట్రిబ్యూటర్లు అంతా మండిపడుతున్నారు. టైగర్ నాగేశ్వరరావుకు పెద్ద అన్యాయం జరుగుతుందని వారు వాపోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news