Newsసోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఎన్టీఆర్ కాన్సెప్ట్ పోస్టర్..!

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఎన్టీఆర్ కాన్సెప్ట్ పోస్టర్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా తేజ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్.టి.ఆర్ సిని, రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందని చెప్పేలా ఈ సినిమా ఉంటుందట. ఇక ఈ సినిమా మార్చి 29న సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాకు సంబందించిన కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.

ఎన్.టి.ఆర్ కు సంబందించిన అన్ని విషయాలు ఈ పోస్టర్ లో ఉన్నాయి. సొంత ఊరు, ప్రచార రథం, తెలుగుదేశం జెండా, నటించిన పాత్రలు ఇలా అన్నిటితో అద్భుతమైన కాన్సెప్ట్ పోస్టర్ రెడీ చేశారు. నందమూరి అభిమానులకు ఈ పోస్టర్ బాగా నచ్చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఎన్.టి.ఆర్ గా బలయ్య ఫస్ట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఈ సినిమా కోసం బాలకృష్ణ 60కి పైగా గెటప్పుల్లో కనిపిస్తాడని అంటున్నారు. బాలకృష్ణ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి, విష్ణు వర్ధన్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ntr

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news