Newsహీరోయిన్ కళ్యాణి కాపురంలో చిచ్చు పెట్టిన ఆ హీరో ఎవ‌రంటే...!

హీరోయిన్ కళ్యాణి కాపురంలో చిచ్చు పెట్టిన ఆ హీరో ఎవ‌రంటే…!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కళ్యాణి అంటే ఇప్పటి ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు.. ఈమె ఒకప్పుడు ఎంతో మంచి హోమ్లీ పాత్రల్లో నటిస్తూ కుటుంబ కథ ప్రేక్షకులను బాగా అలరించింది. అలాంటి ఈ హోమ్లి హీరోయిన్ శేషు, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, పందెం, వసంతం,పెళ్ళాంతో పనేంటి, ఆపరేషన్ దుర్యోధన, లేత మనసులు వంటి సినిమాల్లో నటించింది.

ఈమె అప్పట్లో నటిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలో హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు నటించింది. అలాంటి కళ్యాణి డైరెక్టర్ సూర్య కిరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలకే అతడితో విడాకులు తీసుకుంది. వీరిద్దరూ విడిపోవడానికి ముఖ్య కారణం వారి మధ్య ఆర్థిక సమస్యలే అని ఈ మధ్యకాలంలో సూర్యకిరణ్ సోదరి బుల్లితెర ఆర్టిస్ట్ అయిన సుజాత ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది.

సూర్యకిరణ్- కళ్యాణి విడిపోయిన సమయంలో మీడియాలో కొన్ని వార్తలు బాగా వైరల్ గా మారాయి.. అవి ఏమిటంటే.. కళ్యాణి తన భర్తకు విడాకులు ఇవ్వడానికి ప్ర‌ధ‌న‌ కారణం మరో స్టార్‌ హీరో అని ఆ స్టార్ హీరో వల్లే కళ్యాణి కాపురం కూలిపోయింది అప్పట్లో పలు వార్తలు గట్టిగా వినిపించాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు జగపతిబాబు అని అప్పట్లో గట్టిగా వినిపించింది. జగపతిబాబు- కళ్యాణి కాంబినేషన్లో కబడ్డి కబడ్డి, పందెం, ఓ మనిషి కదా, లక్ష్యం, లెజెండ్, రక్ష, పెద్దబాబు వంటి సినిమాలు వచ్చాయి.

ఈ సినిమాల్లో హీరోయిన్‌గా నటించే సమయంలోనే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని టాక్ బయట గట్టిగా వినబడటంతో ఈ విషయం సూర్యకిరణ్‌కి తెలిసి వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవట. ఈ కారణంతోనే కళ్యాణి తన భర్తకు విడాకులు ఇచ్చేస్తుందని అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం కోడై కూసింది. అయితే ఇందులో ఎంతవరకు నిజమందో కళ్యాణి , సూర్యకిరణ్‌కి మాత్రమే తెలుసు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news