పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలు మూడు లైన్లో ఉన్నాయి. ముందుగా హరిహర వీరమల్లు సినిమా ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓజీ.. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ మూడు సినిమాలలో ముందుగా రిలీజ్ అయ్యే సినిమా హరిహర వీరమల్లు. రాబిన్‌హుడ్ టైప్ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవలే పవన్ ముగించాడు.ఏఎం. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ నుంచి కొన్ని పొలిటికల్ పంచులు కూడా ఉండబోతున్నాయట. ‘‘డబ్బుల కోసం.. పదవుల కోసం నమ్మిన ధర్మాన్ని మార్చుకునే మనిషిని కాను’’ అనే పవర్‌ఫుల్ డైలాగ్ ఉండబోతుందంటున్నారు. ఇది ఖచ్చితంగా పవన్ రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉండే డైలాగ్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
ఇక వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ భామ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కూడా మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
వీరమల్లులో ఆ పొలిటికల్ పంచ్‌లు ఎవరిమీద పవన్…!
