Moviesఅక్కినేని హీరోతో మృణాల్ ఠాకూర్ పెళ్లి ఫిక్స్ .... ?

అక్కినేని హీరోతో మృణాల్ ఠాకూర్ పెళ్లి ఫిక్స్ …. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది మోస్ట్ పవర్ఫుల్ స్టార్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నారు. మరి కొంతమంది సినీ కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో నటుడు సుమంత్ కూడా ఒకడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోగా నటించినా.. ఇప్పుడు మాత్రం సుమంత్ తన కెరీర్‌లో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. సుమంత్ ఏన్నో సినిమాల్లో కీలక పాత్రను పోషిస్తూ మంచి ఫెమ్ తెచ్చుకున్నాడు. ఇటీవ‌ల‌ సుమంత్ సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు.Social News XYZ - Dulquer Salmaan, Mrunal Thakur, And Sumanth's Sita  Ramam Movie Team At At Lulu Mall In Kochi - Gallery Set 1 - Social News XYZ  | Facebook

ఇక సుమంత్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఒకప్పుడు నటి కీర్తి రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక కీర్తి రెడ్డి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మ‌డు కొంతకాలానికి సుమంత్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డింది. అప‌ట్లో ఈ వార్త‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వాటికి త‌గ్గ‌టే.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట వైభవంగా వివాహాం జరుపుకున్నారు. కానీ వారి రిలేషన్షిప్ ఎక్కువ కాలం కొనసాగలేదు. కొద్ది కాలంలోనే విడిపోయారు. రెండు సంవత్సరాలు పాటు మాత్రమే వీరిద్దరూ వారి వివాహ జీవితాన్ని కొనసాగించారు.ఇక అప్ప‌టినుంచి సుమంత్ ఇప్పటివరకు ఎవర్ని పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉంటున్నాడు. తన ఫోకస్ మొత్తం సినిమాల పై పెడుతున్నాడు. ఈ క్రమంలోనే హీరో సుమన్ , హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో ప్రేమలో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటో తెగ ట్రెండ్ అవుతుంది. అందులో’మృణాల్ ఠాకూర్‌.. సుమంత్ భుజం పైన తలవాల్చుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ క్ర‌మంలో సోషల్ మీడియాలో ఈ పిక్ తెగ టోల్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ఏదైనా సినిమాలో భాగంగా తీసుకున్నారా… లేదా నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా.. అనే సందేహాలు జనాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తల‌లో వాస్త‌వం ఎంతో తెలియాలంటే సుమంత్, మృనాల్ క్లారిటీ ఇవ్వ‌ల్పిందే.

Latest news