ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్.. ` గౌరవం` మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత అరడజనుకు పైగా చిత్రాల్లో నటించాడు. కానీ సరైన హిట్ మాత్రం పడలేదు. తండ్రి పెద్ద నిర్మాత, అన్న పాన్ ఇండియా హీరో.. కానీ శిరీష్ కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే సాగుతుంది. నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకున్న శిరీష్.. ఇండస్ట్రీ లోకి వచ్చి దశాబ్దం పూర్తయిన ఒక్క సూపర్ హిట్ కూడా అందుకోలేకపోయాడు.అల్లు శిరీష్ నుంచి చివరగా వచ్చిన ఉర్వశివో రాక్షసివో, బడ్డీ చిత్రాలు కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. ప్రొఫెషనల్ లైఫ్ గురించి పక్కన పెడితే.. శిరీష్ ఏజ్ 37, స్టిల్ సింగిల్. గత పదేళ్ల నుంచి పెళ్లిపై అల్లు అరవింద్ ఎంత ఒత్తిడి తెస్తున్నా.. శిరీష్ మాత్రం నాట్ ఇంట్రెస్ట్డ్ అని అనిపిస్తున్నాడట. తాజాగా శ్రీ విష్ణు నటించిన ` సింగిల్` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
అదే ఈవెంట్ లో ఉన్న శిరీష్.. పెళ్లికి నో చెప్పడానికి రీజన్ ఏంటో వివరించడం విశేషం. ఒక్కసారి మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయితే ఫ్రీడమ్ మొత్తం పోతుంది అన్నట్లుగా శిరీష్ మాట్లాడాడు. సింగిల్ గా ఉండటమే ఉత్తమం అన్నాడు. ` పెళ్లయిన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి మీ లైఫ్ ఎలా ఉంది? నన్ను కూడా మ్యారేజ్ చేసుకోమంటారా? ` అని అడిగితే.. వారు చేసుకోవద్దని చెబుతున్నారు. సింగిల్ లైఫే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. అదే నేను ఫాలో అవుతా అంటూ అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. మరి నిజంగా శిరీష్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోతాడా? లేక మనసు మార్చుకుని ఎవరో ఒకరితో మింగిల్ అవుతాడా? అన్నది చూడాలి.
పదేళ్ల నుంచి పెళ్లిపై ఒత్తిడి.. శిరీష్ నో చెప్పడానికి రీజన్ ఇదే!
