MoviesTL సినిమా రివ్యూ : హిట్: ది థర్డ్ కేస్

TL సినిమా రివ్యూ : హిట్: ది థర్డ్ కేస్

నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి: మృదుల, విజయ్ సేతుపతి, అడివి శేష్, రావు రమేష్, బ్రహ్మాజీ, సముద్రఖని, ప్రతీక్ బబ్బర్
రచన, దర్శకుడు: శైలేష్ కొలను
నిర్మాతలు: ప్రశాంతి తిపిర్నేని, నాని (వాల్ పోస్టర్ సినిమా & యూనానిమస్ ప్రొడక్షన్స్)
సంగీత దర్శకుడు: మిక్కీ జే. మేయర్
సినిమాటోగ్రఫీ: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్,
విడుదల తేదీ: మే 1, 2025
సర్టిఫికేషన్ : ‘A’ (హింస)HIT 3 to hit the theaters from May 1: TEASER OUT! - Bigtvlive English
🎬 కథ:
“హిట్: ది థర్డ్ కేస్” ఒక యాక్షన్ ప్యాక్డ్ క్రైమ్ థ్రిల్లర్, ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (HIT) లో ఎస్పీగా నటిస్తాడు. విశాఖపట్నం నుండి జమ్మూ కాశ్మీర్‌కు బదిలీ అయిన అర్జున్, ఒక సీరియల్ కిల్లర్ గ్యాంగ్ చేసిన దారుణమైన హత్యల కేసును ఛేదించే అధికారిగా నియమితుడవుతాడు. కథలో అతని పాత్ర ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్. కఠినమైన నిజాయితీపరుడైన అధికారిగా అతని నటన పీక్స్ లో ఉంది. 9 నెలల పసికందు కిడ్నాప్ అతని క్రమశిక్షణకు ఎమోషన్ ను తోడై నిందితుల అంతు చూడటానికి తానే హంతకుడిగా మారి నేరస్థుడయ్యే పరిస్థితి వస్తుంది… ఈ నేపథ్యంలో తాను కేసుల నుంచి బయటపడి తాను చేపట్టిన కేసులను ఎలా చేధిస్తాడన్నది మిగతా కథ. ఒకానొక దశలో నానిని మరిచిపోయి పాత్రలో మనం పరకాయ ప్రవేశం చేస్తాం.Buzz: Date locked for Nani's HIT 3 teaser?🟢😊 ప్లస్ పాయింట్లు:
నాని నటన: నాని తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. అర్జున్ సర్కార్‌గా అతని యాంగర్, డైనమిక్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా చివరి 20-30 నిమిషాలు, అతని మాస్ అవతార్ అభిమానులకు పండగలా ఉంటుంది. నాని యొక్క ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, నాని యొక్క రూత్‌లెస్ కాప్ రోల్, అతని డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్‌లను యూజర్స్ ప్రశంసించారు., చాలా మంది ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి.

🎞️ స్టైలిష్ ప్యాకేజింగ్: సను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, మిక్కీ జే. మేయర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో) సినిమాకు బలమైన టెక్నికల్ బ్యాకింగ్ ఇచ్చాయి.

🎞️ యాక్షన్ సీక్వెన్సెస్: ప్రీ-క్లైమాక్స్ యాక్షన్ సీన్స్, ప్రీ-ఇంటర్వెల్ జైపూర్ ఎపిసోడ్‌లు థియేటర్‌లో హైలైట్‌గా నిలుస్తాయి.

🎞️ సర్‌ప్రైజ్ కామియోలు: రెండు ఆశ్చర్యకరమైన కామియోలు విజయ్ సేతుపతి, అడివి శేష్… ముఖ్యంగా అడివి శేష్ పాత్ర, సినిమాకు బాగా ఉపయోగపడింది.
🎞️ షార్ప్ డైలాగ్స్: కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ బాగా రాసారు, నాని డెలివరీ వాటిని మరింత ఎఫెక్టివ్‌గా చేసింది.Sailesh Kolanu lashes out at leaks about Tamil star's cameo in Nani's HIT 3:  'You're stealing from the audience' - Hindustan Times🔴☹️ మైనస్ పాయింట్లు:
👎 వీక్ విలన్: విలన్ పాత్ర బలహీనంగా రాసారు. అతను నాని పాత్రకు ఢీకొనంత స్ట్రాంగ్ గా లేదు. ఇది కథకు పెద్ద లోటు. అతని బ్యాక్‌స్టోరీ బలహీనంగా ఉంది.

👎 స్లో ఫస్ట్ హాఫ్: ఫస్ట్ హాఫ్‌లో పేస్ నెమ్మదిగా ఉంది, ఇన్వెస్టిగేషన్ డెప్త్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది.

👎 రొమాంటిక్ ట్రాక్: నాని, శ్రీనిధి శెట్టి మధ్య రొమాంటిక్ ట్రాక్, పాటలు కథకు అడ్డంకిగా అనిపిస్తాయి.

👎 లాజిక్‌లెస్ నరేషన్: కొన్ని సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా, ప్రిడిక్టబుల్‌గా ఉన్నాయని కొందరు విమర్శించారు. అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. హిట్ 1 మరియు హిట్ 2తో పోలిస్తే, కథలో డెప్త్ కొంచెం తక్కువగా ఉందని చెప్పాలి.
మైనస్ అని చెప్పలేం గాని సినిమాలో హింస కాస్త ఎక్కువైంది. బూతు పదజాలం ఉన్నందున కొందరికి ఎక్కువ నచ్చొచ్చు. ఇంకొందరు ఇబ్బంది పడొచ్చు.Nani's 'HIT 3' begins promotion with a duet song | Telugu Cinema▪️ సాంకేతిక అంశాలు:
దర్శకుడు శైలేష్ కొలను మునుపటి “హిట్” సినిమాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా నాని పాత్రను ఎలివేట్ చేయడంపై దృష్టి పెట్టాడు, కానీ స్క్రీన్‌ప్లే టైట్‌గా ఉండటంలో కొంచెం వెనుకబడ్డాడు.
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ (కార్తిక శ్రీనివాస్) సినిమాకు మంచి ఫీల్ ఇచ్చాయి, కానీ ఫస్ట్ హాఫ్‌లో ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండొచ్చు.
మిక్కీ జే. మేయర్ సంగీతం సెకండ్ హాఫ్‌లో బాగా కుదిరింది, కానీ ఫస్ట్ హాఫ్‌లో అంతగా ఆకట్టుకోలేదు.

⭕ తీర్పు:

“హిట్ 3” నాని అభిమానులకు, మాస్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఒక డీసెంట్ వాచ్. నాని తన నటనతో సినిమాను మొత్తం మోసినా, వీక్ విలన్, స్లో పేస్ కొంచెం సినిమాను దెబ్బ తీశాయి. థియేటర్‌లో ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.HIT 3 Movie Live Updates, HIT 3 Movie Review, HIT 3 Movie USA Talk, HIT 3  Movie Reports, Nani, Srinidhi Shetty, HIT: The Third Case, HIT: The Third  Case Movie Review and Rating✅ ప్రకాష్ చిమ్మల వర్డ్ : నానిలో కొత్త యాంగిల్, ఇంటెన్సిటీ చూడాలనుకుంటే మాత్రం మస్ట్ వాచ్.

✅ ఫుల్ రేటింగ్: 2.75/5

(నాని అభిమానులకు మాత్రం నా రేటింగ్ 3.25/5 )

Latest news