టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ . జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫాంటసీ హిట్ సినిమా తర్వాత చిరు నటిస్తోన్న ఈ సినిమాపై సోషియో ఫాంటసీ కథాంశాలను మెచ్చే అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఖర్చు విషయంలో యూవీ వాళ్లు ఎక్కడా రాజీపడడం లేదట. వీఎఫ్ఎక్స్ కోసమే చిత్ర యూనిట్ ఏకంగా రూ.75 కోట్ల మేర ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. దీనిని బట్టే ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతోందో తెలుస్తోంది.
ఇక విశ్వంభర సినిమాలో అందాల భామ త్రిష, అషికా రంగనాథ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా యువీ క్రియేషన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
‘ విశ్వంభర ‘ వీఫ్ఎక్స్ వర్క్ @ రు. 75 కోట్లు.. !
