Movies' హిట్ 3 ' ... త‌న కంచుకోట‌లో ఊచ‌కోత కోసి...

‘ హిట్ 3 ‘ … త‌న కంచుకోట‌లో ఊచ‌కోత కోసి ప‌డేస్తోన్న నాని..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని న‌టుడు, నిర్మాత‌గా ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక‌ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “హిట్ 3”. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నాని స‌ర‌స‌న క‌నిపించ‌నుంది. డైరెక్టర్ శైలేష్ కొలను సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందించాడు. శైలేష్ సినిమాటిక్ యూనివర్స్‌ నుంచి వస్తున్న మూడో ఇన్స్టాల్మెంట్ సినిమా కనుక దీనిపై ఆడియ‌న్స్‌లో భారీ అంచనాలు నెల‌కొన్నాయి.HIT 3: Big Twist with a Mass Hero's Entry - TeluguBulletin.comమరి ముఖ్యంగా నాని సినిమా వస్తుంది అంటే.. మన తెలుగు రాష్ట్రాల్లో కంటే యూఎస్ మార్కెట్ లో మంచి బ‌జ్ నెల‌కొంటుంది. ఈ క్ర‌మంలోనే సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ సహా.. ప్రీమియర్స్ ప్రీసేల్స్ లో సత్తా చాటుతుంది. మరి హిట్ 3 సినిమాకి ఏ రేంజ్ ఓపెనింగ్స్ ఉంటాయో అనేది వేచి చూడాలి. ఇక ఇదే స్ట్రాంగ్ జోన్‌లో ఇప్పుడు హిట్3 ఊచకోత గట్టి గానే ఉందని తెలుస్తుంది. మరి నాని ఈ సినిమా కోసం నార్త్ అమెరికా మార్కెట్‌లో భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారన సంగతి తెలిసిందే.Hit 3': Srinidhi Shetty joins the cast of Nani - Saliesh Kolanu's next -  The Hinduఅటు నార్త్ అమెరికాలో కూడా.. ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ ఉంటాయా లేదా వేచి చూడాలి. ఈ సినిమా కేవలం ప్రీసేల్స్‌తో హాఫ్ మిలియన్ మార్క్ దగ్గరికి వెళ్లినట్లు టాక్‌. దీంతో నాని కెరీర్‌లోనే హిట్ 3 మంచి ఆల్ టైం హైయెస్ట్ అండ్ పాజిటివ్ మార్క్ గా నిలిచిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా మే 1న గ్రాండ్‌గా విడుదల కానుంద‌ని తెలుస్తోంది. మొత్తానికి ప్ర‌స్తుతం నానిగారి మూవీ.. అర్జున్ సర్కార్ రాంపేజ్ మామూలుగా లేదని చెప్పవచ్చు.

Latest news