టాలీవుడ్ మాస్ దర్శకుడు వివి వినాయక్ రవితేజ తో ఓ సినిమా చేయబోతున్నట్లు పలు రూమర్లు వినిపిస్తున్నాయి .. వినాయక్ కొన్ని సంవత్సరాల గా సైలెంట్ గా ఉన్నారు .. అయితే ఇప్పుడు ఎట్టకేల కు ఆయన మళ్ళీ మెగా ఫోన్ పట్టబోతున్నార ని టాలీవుడ్ లో గత కొన్ని రోజులగా టాక్ వినిపిస్తుంది .. ఈ మధ్య సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి ..అయితే ఇప్పుడు మళ్ళీ రవితేజ కి వినాయక్ ఓ స్టోరీ చెప్పాడ ని .. రవితేజ సినిమా చేయడానికి ఓకే చెప్పాడని కూడా తెలుస్తుంది .. అయితే ఈ రూమర్స్ లో నిజం ఎంత ఉందో గానీ , వినాయక్ సినిమా పై మాత్రం ఎప్పటినుంచో ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి .. అయితే ఇక్కడ కాకపోతే రవితేజ హీరోగా , వినాయక్ దర్శకుడు గా ఒక సినిమా రాబోతుందని వార్త ఎప్పుడు వస్తూనే ఉంది .. రీసెంట్గా వినాయక్ సక్సెస్ లో లేడు ..
కాబట్టి ఎలాగైనా సక్సెస్ ను అందుకోవాలని కసితో వినాయక్ తన తర్వాత సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్నాడట . అయితే ఇప్పుడు రవితేజ ఇమేజ్ కోసం వినాయక్ ఎలాంటి స్టోరీ రాశాడో చూడాలి .. ఇదే క్రమంలో ఈమధ్య వినాయక్ బాలయ్యతో కూడా సినిమా చేయాలనుకుంటున్నాడు .. అయితే ప్రెసెంట్ వినాయక్ రవితేజ తో మాత్రమే తన సినిమా ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది . ఇక మారి దీనిపై ఎప్పుడు అధికార ప్రకటన వస్తుందో చూడాలి .
రవితేజ లైన్ లో పెడుతున్న వినాయక్ .. ఇదైనా కన్ఫర్మ్ అవుతుందా?
