నందమూరి నట సింహం బాలకృష్ణ వరుసగా హిట్ సినిమాలతో కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. బాలయ్య ఈ సంక్రాంతికి డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. కేఎస్. రవీంద్ర ( బాబి ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతికి గట్టి పోటీ మధ్యలో వచ్చి కూడా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే అత్యధికంగా రు. 180 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
బాలయ్య వరుసగా అఖండ , వీరసింహారెడ్డి , భగవంత్ కేసరి , డాకు మహారాజ్ సినిమాలతో ఫుల్ స్వింగ్లో ఉండగా.. పై మూడు సినిమాలు బాలయ్య కంచుకోట లాంటి సెంటర్‌లో సెంచరీ కొట్టాయి. ఇప్పుడు డాకూ మహారాజ్ సినిమా కూడా ఆ కంచుకోటలో సెంచరీ దిశగా దూసుకుపోతోంది. ఆ కంచుకోట ఏదో కాదు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట. ఈ సెంటర్ అంటేనే నందమూరి సినిమాలకు కేరాఫ్ అడ్డా. నందమూరి హీరోలు నటించిన చాలా సినిమాలు ఇక్కడ టాక్‌తో సంబంధం లేకుండా సెంచరీ కొట్టేస్తూ ఉంటాయి.బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌కేసరి మూడు సినిమాలు ఇక్కడ వంద రోజులు ఆడాయి. ఇక ఇప్పుడు డాకూ మహారాజ్ సైతం 80 రోజులకు చేరువై 100 రోజుల దిశగా దూసుకుపోతోంది. పై మూడు సినిమాలు రామకృష్ణ థియేటర్లో 100 రోజులు ఆడగా.. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే థియేటర్లో సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. .బాలయ్య కి జోడిగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటెలా , శ్రద్ధ శ్రీనాథ్ , చాందిని చౌదరి కూడా కీలక పాత్రలలో నటించారు .. తమన్ అందించిన సంగీతం నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది.