చిత్ర పరిశ్రమలో సినిమాల్లోనూ, రాజకీయాలను తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రోజ అంటే తెలియని వారు ఉండరు. రోజా పెద్ద టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆమె సంగతి మనకు తెలిసిందే. రోజా తన సినిమాలతో ఎంతోమంది కుర్రకారుని తన వలలో వేసుకుంది. గతంలోఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ,మంత్రిగా తన బాధ్యతలు నిర్వహించిన రోజా రాజకీయాల్లోకూడా సంచలనంగా మారారు.. ఇప్పుడు రోజా కి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
అది ఏమిటంటే రోజాకి ,దగ్గుపాటి వెంకటేష్ కి మధ్య గొడవలు ఉన్నాయని గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ తేగా వైరల్ గా మారింది .వీళ్ళిద్దరికీ జరిగిన గొడవ విషయం పై రైటర్ తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తోటా ప్రసాద్ మాట్లాడుతూ వెంకటేష్ , రోజా మధ్య గొడవలు ఉన్నయి అనేవి నిజమే.. కానీ ఆ గొడవలకు వెంకటేష్ కి ఎలాంటి సంబంధం లేదు. రోజా కి కొంచెం తొందరపాటుతనం తో నిర్ణయాలు తీసుకుని సౌందర్యాన్ని, వెంకటేష్ ని విమర్శించింది ఆ విషయంపై వెంకటేష్ ని అడగగా ఆ గొడవకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అని సమాధానం ఇచ్చారు ..
తనకి ఓ సినిమాలో తనని వద్దని వేరే హీరోయిన్ ని పెట్టుకున్నారని ఉద్దేశంతో నాపై విమర్శలు చేస్తుంది. అని వెంకటేష్ గట్టిగానే సమాధానం ఇచ్చారు. హీరోయిన్ ని షూస్ చేసుకునే విషయంలో నాకు ఎటువంటి సంబంధం ఉండదు .అదంతా ప్రొడ్యూసర్ చూసుకుంటారు. ఈ రూమర్స్ మీరు ట్రెండ్ చేసిన పర్లేదు .అని క్లారిటీ ఇచ్చారు. రోజా కి కొంచెం తొందరపాటుతనం ఎక్కువ కాబట్టి అసలు విషయం తెలియకుండా వెంకటేష్ , సౌందర్యాలని హేళన చేసింది,’ రాజా’ సినిమాలో ముందుగా రోజా అని అనుకున్నారట.వెంకటేష్ ,రోజా కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి రాజా’ మూవీ డిజాస్టర్ అయిందని ఈ హీరోయిన్ కలిసి రాలేదు.అని నిర్మాతలు రోజా ని పక్కనపెట్టి సౌందర్యాన్ని తీసుకున్నారు. సౌందర్యాన్ని తీసుకోవడంతో రోజా విమర్శలు చేసింది. కానీ ఈ విషయంపై వెంకటేష్ మాత్రం నేను ఏ హీరోయిన్ ని నిర్మాత తీసుకువస్తే ఆ హీరోయిన్ తోనే చేస్తాను. ఏ హీరోయిన్ తోనైనా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అని ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ రోజా మాత్రం ఎంత మంది చెప్పినా వినకుండా వెంకటేష్, సౌందర్యాలను విమర్శించింది. అంటూ రైటర్ తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు…