Moviesక్రేజీ పిక్ : జపాన్ లో తన వైఫ్ తో మ్యాన్...

క్రేజీ పిక్ : జపాన్ లో తన వైఫ్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ .. ప్రణతికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన తారక్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , స్టార్ దర్శకుడు కొర‌టాల‌ శివ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దేవర .. అయితే ఈ సినిమా మన ఇండియా లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది .. ఈ సినిమా తో ఎన్టీఆర్ సో లోగా పాన్‌ ఇండియా స్థాయిలో 500 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకున్నాడు .. అయితే ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో రిలీజ్ కి రెడీ అయింది .. అక్కడ ఎన్టీఆర్ ఈ సినిమాని ఎంతో అగ్రెసివ్ గా ప్రమోషన్ చేస్తున్నాడు ..
అలాగే అక్కడ తన అభిమానుల తో ముచ్చడించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ బ్యూటిఫుల్ పోస్ట్ ని కూడా తన అభిమానుల తో పంచుకున్నాడు .. ఇక తన భార్య ప్రణతిని కూడా జపాన్ తీసుకు వెళ్ళగా అక్కడ ఆమె పుట్టినరోజు వేడుకలను కూడా చేయటం మరింత విశేషంగా మారింది .. ఇలా ఇద్దరి నడుమ కొన్ని హ్యాపీ మూమెంట్స్ ని ఎన్టీఆర్ ఫొటోస్ గా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ఇప్పుడు ఎంతో వైరల్ గా మారాయి . అవి చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు ..
ఇక దేవర మార్చ్ 27 అనగా రేపు జపాన్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది .. అలాగే అక్కడ ప్రీమియర్స్ కి సాలిడ్ టాక్ కూడా వచ్చింది .. ఇక మరి జపాన్ లో ఎన్టీఆర్ కలెక్షన్ రూపంలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి .. అలాగే ప్రస్తుతం ఈ స్టార్ హీరో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో నటిస్తున్నాడు .. ఈ సినిమా తో పాటుగా ప్రశాంత్ నీల్‌ సినిమాని కూడా రీసెంట్ గానే మొదలు పెట్టాడు .. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాల తో ఎన్టీఆర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ..

Latest news