నితిన్ హీరోగా వెంకి కరుణ దర్శకత్వంలో వచ్చిన మూవీ రాబన్ హుడ్ .. భీష్మ లాంటి హిట్ సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావటంతో అంచనాలు కూడా భారీ గానే ఉన్నాయి .. అలాగే ఈ సినిమాల్లో క్రికెట్ కింగ్ డేవిడ్ వార్నర్ ఓ ప్రధాన పాత్రలో నటించిడు ..ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమా ఎలా ఉందో అనేది ఈ రివ్యూ లో చూద్దాం .కథ:
రామ్ అలియాస్ రాబిన్ హుడ్ (నితిన్) అనాధ .. చిన్నతనం నుంచి ఆశ్రమంలోనే పెరుగుతాడు అయితే సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరే కొట్టేసి అనాధ ఆశ్రమానికి ఇస్తూ ఉంటాడు .. అతని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ విక్టర్ (షైన్ టామ్ చాకో) . కాని ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ తప్పించుకుంటూ ఉంటాడు రామ్ . ఆ క్రమంలోని ఆస్ట్రేలియా నుంచి ఒక పని మీద నీరా వాసుదేవ్ (శ్రీ లీల) ఇండియాకు వస్తుంది .. ఆమెను మళ్లీ ఆస్ట్రేలియా పంపే వరకు సెక్యూరిటీగా జాన్ స్నో (రాజేంద్ర ప్రసాద్) ఉంటాడు .. అయితే అదే టీం లో రామ్ కూడా జాయిన్ అవుతాడు .. మరోవైపు రుద్రకొండ అనే ఊరిలో గంజాయి పండిస్తూ ఆ ఊరు వాళ్లను తన అదుపులోకి పెట్టుకుంటాడు సామి (దేవదత్త) ఇక వాళ్లతో రామ్ ఎలా యుద్ధం చేసాడో ఆ ఊరు వారిని ఎలా కాపాడుడు అనేది మిగిలిన స్టోరీ .
విశ్లేషణ:
రాబిన్ హుడ్ .. ఈ పేరు చాలు సినిమా ఎలా ఉంటుందో చెప్పటానికి .. ఎప్పటినుంచో టాలీవుడ్ లో చూస్తున్న కథ లాంటిదే . డబ్బున్న వాళ్ళని దోచి పేదవాళ్ళకు పెట్టే స్టోరీని దాన్ని మరోలా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకీ కుడుముల . అయితే ఈ సినిమాలో రవితేజ కిక్ ఫార్ములా కాస్త ఎక్కువగా కనిపిస్తుంది .. ఇక సినిమా మొదలైన 20 నిమిషాల పాటు హీరో ఎందుకు దొంగగా మారాడు అతను ఏం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అనే విషయాన్ని బాగా చూపించాడు దర్శకుడు . స్లోగా అదే సినిమాను ముందుకు తీసుకువెళ్లింది .. అలాగే వెంకి కుడుముల బలం కామెడీ . చలో, భీష్మ సినిమాలో ఆయన చేసింది కూడా అదే .. లవ్ ప్రోటీన్ కథలు తీసుకున్న వాటిలో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చూపించాడు . అయితే ఇప్పుడు రాబిన్ హూడ్‌లో మాత్రం అది కాస్త మిస్ అయినట్టు కనిపిస్తుంది .. వాటికి తోడు రొటీన్ స్టోరీని తీసుకోవడం తో స్క్రీన్ ప్లే కూడా మరింత రొటీన్ గానే అనిపిస్తుంది .
ఇంటర్వెల్ వరకు ఏదో అలా అక్కడక్కడ కామెడీ సీన్స్ చూపించాడు కానీ సెకండాఫ్ మాత్రం అంతగా మెప్పించలేకపోయాడు .. విడుదలకు ముందు వివాదం సృష్టించిన ‘అదిదా సర్‌ప్రైజ్’ పాటలోని ‘హుక్’ ప్టెప్ కనిపించకపోవడం ప్రేక్షకులకు అసలు సర్‌ప్రైజ్. డేవిడ్ వార్నర్ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకొన్నారు. డేవిడ్ వార్నర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కాకపోతే.. వార్నర్‌ని సరిగా వాడుకోలేదు. అతని రాక కథకు గానీ, సన్నివేశానికి గానీ ఎలాంటి ఇంపాక్ట్ తీసుకురాలేకపోయింది.ఇక మళ్ళీ చివర క్లైమాక్స్ 20 నిమిషాలు బాగా రాసుకున్నాడు .. ఇక నీతిని శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు పర్లేదు అనిపిస్తాయి . అలాగే ఈ సినిమాకు వెన్నెల కిషోర్ తన కామెడీతో కొంత కాపాడాడు .. వెన్నెల కిషోర్ కనిపించిన చాలా సన్నివేశాలు ధియేటర్లో ప్రేక్షకుల్ని బాగా నవ్వించేలా చేస్తాయి ..గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాడు వెంకీ దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే పర్లేదు అనిపిస్తుంది .. అయితే కాకపోతే అక్కడక్కడ స్టోరీ తిరగటంతో కొంత బోర్ అనిపిస్తుంది .. భీష్మల వ్యవసాయం గురించి ఎలా ఎంటర్టైన్ గా చెప్పాడో వెంకి.. ఈసారి అలాంటి కామెడీ బాగా మిస్ అయింది ఏదో రొటీన్ సినిమాగా వెళ్లిపోయింది .
నటీనటులు పర్ఫామెన్స్:
నితిన్ స్క్రీన్ మీద చాలా బాగున్నాడు . తన నటనలో ఎంతో యాక్టివ్ నెస్ కనిపించింది . కామెడీ టైమింగ్ కూడా బాగుంది .. హీరోయిన్గా శ్రీలీల నటన గురించి చెప్పడానికి ఏమీ లేదు .. మరోసారి తన రొటీన్ హీరోయిన్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది . రాజేంద్రప్రసాద్ , వెన్నెల కిషోర్ ఉన్నంతలో కాస్త కామెడీతో పండించారు .. దేవదత్త విలననిజం రొటీన్ గానే అనిపిస్తుంది . పోలీస్ క్యారెక్టర్ లో షైన్ టామ్ పర్లేదు .. మిగిలిన నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు .టెక్నికల్ టీం:
జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ ఓకే , పాటలు అంతగా మెప్పించలేదు .. బ్యాక్గ్రౌండ్స్ కోడ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది .. ఎడిటింగ్ చాలా వరకు వీక్ అనిపిస్తుంది .. కాకపోతే దర్శకుడు వెంకీ కుడుముల ఛాయిస్ కాబట్టి ఎడిటర్ ను తప్పు పట్టలేం .. సినిమాటోగ్రఫీ చాలా వరకు బాగుంది .. స్టోరీ చాలా పాతది అయిన వెంకీ స్క్రీన్ ప్లే కూడా అలాగే అనిపిస్తుంది .. మైత్రి మూవీస్ కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టారు .
చివరగా: ఫ్యామిలీతో ఒక్కసారి చూడదగ్గ రొటీన్ దొంగ సినిమా..
రేటింగ్: 2.5