Moviesమోహన్ లాల్ లూసిఫర్ సినిమా వెనక .. అంతుచిక్కని విషాదం ఇదే...

మోహన్ లాల్ లూసిఫర్ సినిమా వెనక .. అంతుచిక్కని విషాదం ఇదే ..?

ఈవారం రిలీజ్ కాబోతున్న ఎల్ 2 ఎంపురాన్ మొదటి భాగం లూసిఫర్ ని తెలుగు ప్రేక్షకులు ఓటిటిలో బాగానే ఆదరించారు .. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్‌గా రీమిక్‌ చేసినప్పటికీ ఒరిజినల్ ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు . ఇక మలయాళం లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫర్ వెనక చాలా పెద్ద కథ నడిచింది .. ఇప్పుడు ఎల్ 2 ప్రమోషన్స్లో అది బయటకు వచ్చింది .. అది ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం .. 2012లో రాజేష్ పెళ్లై అనే దర్శకుడు లూసిఫర్ పేరుతో ఒక కథను రాసుకున్నాడుమోహన్ లాల్ కి చెప్పాడు రచయిత మురళి గోపి తో కలిసి ఆ స్టోరీను తయారు చేశాడు టైటిల్ రిజిస్టర్ చేసి ప్రాజెక్ట్ ని మీడియా ముందు కూడా ప్రకటించాడు .మాలీవుడ్‌ టు హాలీవుడ్‌.. 'ఎల్‌ 2' స్టార్స్‌ వీరే | key roles of l2 empuraan  movie mohan lal Prithviraj Sukumaranఅయితే అప్పటికే కుంచకో బోబన్ తో మోటార్ సైకిల్ డైరీస్‌ రాస్తున్న రాజేష్ పిళ్ళై అది పూర్తి చేసేందుకు సమయం తీసుకోవడం తో దాంట్లో బిజీ అయిపోయాడు .. అది పూర్తయ్యాక లూసిఫర్ షూటింగ్ కి వెళ్ళలేదు . మరోపక్క గోపి మురళి రైటర్ గా వేరే సినిమాతో బిజీ అయిపోయాడు . అయితే కట్ చేస్తే చివరికి 2016 లో రాజేష్ పిళ్ళై అనారోగ్యం తో మరణించాడు .. అలా లూసిఫర్ ఆగిపోయింది. ఇక కొంతకాలం తర్వాత టైటిల్ మాత్రమే తీసుకొని పూర్తిగా వేరే కథ‌ని తయారు చేశారు గోపి మురళి .. అది వెనగానే మోహన్ లాల్ కు నచ్చింది పృధ్విరాజ్ సుకుమారన్‌ దర్శకుడిగా ఎంట్రీ ఇద్దామని సొంత బ్యానర్ మీద నిర్మించేందుకు రెడీ అయ్యాడు .Lucifer (2019) - Movie | Reviews, Cast & Release Date in bengaluru-  BookMyShowస్క్రిప్ట్ పనుల కోసం కోచిలో ఒక ఫ్లాట్ ను కొన్న పృథ్వీరాజ్ వర్క్‌ మొత్తం అక్కడే చేయించి 2018 లో లూసీ ఫర్ ను షూటింగ్ కి తీసుకెళ్లాడు .. ఆ తర్వాత ఏడాదికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది .. 30 కోట్ల బడ్జెట్ తో తెర్కక్కిన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం అందుకుంది .. అయితే చనిపోయిన రాజేష్ పిళ్ళై అనుకున్న లూసిఫర్ కథ వేరని కేవలం పేరు మాత్రమే తీసుకొని వేరే కథను తయారుచేసారు గోపి మురళి ,పృథ్విరాజ్ .. అలా ఏదేమైనా మోహన్ లాల్ లాంటి అగ్ర హీరోతో సినిమా చేయాలని కలలు కన్న దర్శకుడు ఊహించ‌ని విధంగా మరణించడం అది వేరొకరి చేతికి వెళ్లి భారీ విజయం అందుకోవటం వంటివి విదిలికితం .. అలాగే సినిమాను మించిన డ్రామా అంటే ఇదేనేమో అని కూడా అంటున్నారు .. ఇప్పుడు వస్తున్న ఎల్2 సినిమాతో మోహన్ లాల్ , పృధ్విరాజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Latest news