సౌత్ ఇండస్ట్రీలో ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ .. వైవిద్యమైన ఎన్నో పాత్రలను పోషించి తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరోయిన్ . హిట్, ప్లాప్ లతో ఏమాత్రం సంబంధం లేకుండా అనేక చిత్రాల్లో నటిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అయితే తనకంటూ మంచిఫెమ్ తెచ్చుకునే టైంలో చర్మ వ్యాధులతో బాధపడుతూ సినిమాలకు దూరమయ్యింది. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ కానీ కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు చర్మ సమస్యలతో ఇండస్ట్రీకి దూరమయింది.
ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తనకున్న చర్మ సమస్యల గురించి చెప్పుకొచ్చింది. దానికి కారణంగానే తాను సినిమాల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. తన శరీరంలో కొన్ని అవయవాలు కనుబొమ్మలు, కనురెప్పలు సైతం తెల్లగా మారడాన్ని గమనించి సినిమాలకు దూరమయ్యానని చెప్పింది .ఇక ఈ బ్యూటీ మరెవరో కాదు హీరోయిన్ ” ఆండ్రియా జెరెమియాష ఈమె గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. తెలుగు తో పాటు’ తమిళం’, ‘మలయాళం’ భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది .ఈమె గురించి సోషల్ మీడియాలో ఒక వార్త బయటకు వచ్చింది .
మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుథ్ తో లవ్ ఎఫైర్ ఆ తర్వాత బ్రేకప్ కారణంగా తను ఈ మధ్య కాలంలో తన పేరు బాగా ట్రెండ్ అవుతుంది .నా శరీరం పై ఒక రోజు కొత్త మచ్చలు కనిపించడంతో రక్త పరీక్షలు చేయించానని. రక్త పరీక్షల్లో ఏ సమస్యలు లేవని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇది ఎక్కువగా స్ట్రెస్, ఒత్తిడి వల్ల కావచ్చునని డాక్టర్స్ చెప్పారు ,’వడ చైనా ‘సినిమా తరువాత తన చర్మ సమస్యలు బయటపడ్డాయని చెప్పింది. దాంతో తాను సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది.నేను ప్రేమలో మోసపోయానని అందుకే సినిమాలకు దూరమయానని సోషల్ మీడియాలో రూమర్సు బాగా వైరల్ అయ్యాయి.
కానీ నా ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లి సినిమాల్లోకి వచ్చాను. సమస్యలను ఎదుర్కోవటానికి మాక్సిమం నాకు ఒక సంవత్సరం పడుతుంది అని తెలిపింది. ‘ఆక్యుపంక్చర్ ‘ తనకు పని చేసిందని చెప్పింది. తన ఆహార అలవాట్లను, జీవన శైలి లో కొన్ని మార్పులు చేయడం వలన ఈ సమస్యలు తగ్గాయని తను ఇప్పుడు ఆరోగ్యం వంతంగా ఉన్నానని తను ఇప్పుడు తన పెంపుడు కుక్కతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పుకొచ్చింది. మాస్టర్, పిసాసు వంటి సినిమాలు చేసినప్పుడు ఎవరికీ దాని గురించి తెలియదని తను వెల్లడించింది. ప్రస్తుతం ‘మాస్క్’ సినిమాలో రుహాని శర్మతో కలిసి ఇప్పుడు తను ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది.