మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సినిమాలు వస్తున్నాయంటే అంచనాలు ఎలా ఉంటాయో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2026 మార్చి లో మన ఇండియాన్ సినీ ఇండస్ట్రీలో భారీ పోటీ నెలకొనేందుకు సిద్ధపడుతుంది .ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఏడు రోజులుటైంలో నాలుగు పెద్ద సినిమాలు విడుదలకు పోటీపడుతున్నాయి. ఈ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది .అన్నీ కూడా దిమ్మతిరిగే హాయ్ ఎక్స్పెక్ట్ సినిమాలే .బాక్సాఫీస్ వద్ద విలయతాండవం చేయబోతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.2026 మార్చి 19 రాకింగ్ స్టార్’ యష్’ నటించిన’ టాక్సిక్’ విడుదల కానున్నట్లు ఈ మధ్యకాలంలో అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. కేజిఎఫ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యష్ఈ సినిమాతో మరో హ్యాట్రిక్ కొట్టబోతున్నాడా.. కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా కోట్లకు పైగా వసూలు సంపాదించింది. అదే టార్గెట్లో టాక్సిక్ కూడా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసే సామర్థ్యం ఉందని అంటూన్నారు. మార్చి 20న సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో’ రణబీర్ కపూర్ ‘,విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన’ లవ్ అండ్ వార్ ‘విడుదల కానుంది. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు .
రణబీర్, విక్కీ కౌశల్ వంటి హీరోల కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు, ఈ సినిమా కూడా రూ. 1000 కోట్ల టార్గెట్ ను రీచ్ అవటానికి పెద్ద టైం పట్టకపోవచ్చు, భారీ బడ్జెట్ విస్తృత ప్రమోషన్లతో ఈ సినిమా జనాలను ఆకట్టుకునే అవకాశం ఎక్కువగానే ఉంది ,మార్చి 26న ‘నాని ‘నటించిన ‘ది పేరడైజ్ ‘విడుదల కు సిద్ధమవుతోంది’ ప్రస్తుతం ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి . ‘నాని జీవితంలో ఇది ఎంతో పెద్ద భారీ బడ్జెట్ చిత్రం అని తెలుస్తుంది ‘కంటెంట్ మంచి కిక్ ఇస్తే ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూలు సాధించగలరని సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. మంచి కంటెంట్ ఉంటే క్రేజ్ మరింతగా పెరగవచ్చు. అదే రోజున’ రామ్ చరణ్’ నటిస్తున్న బుచ్చిబాబు సన డైరెక్షన్లో తెరకెక్కుతున్న’RC 16’కూడా విడుదల అవుతుందని తెలుస్తోంది ..
ఈ సినిమా కూడా భారీ హై బడ్జెట్ సినిమా.. రామ్ చరణ్యకూడా మూవీ పై భారీ అంచనలు పెట్టుకున్నాడు ..ఇక ఈ సినిమా కూడా ప్రమోషన్ కి కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే RC16 కూడా 1000 కోట్ల క్యాంపును చేరే అవకాశం ఉంది .ఈ నాలుగు సినిమాలు అనుకున్న ప్రకారం విడుదలయితే ఇండియా బాక్సాఫీస్ రెండు వారాలనే సుమారు 3, 000 కోట్ల టర్నోవర్ ను దాటవచ్చు .ఈ నాలుగు సినిమాలు బిగ్గెస్ట్ సినిమాలు ఒకే టైంలో విడుదల కావడం వల్ల కొంచెం ఇబ్బంది కావచ్చు. అనే సమస్యతో తేదీలను మార్చే అవకాశం ఉంది. నాని వంటి హీరోలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది .మొత్తం మీద వచ్చే మార్చి 2026లో భారతీయ సినీ పరిశ్రమలో భారీ పోటీ ప్రేక్షకులకు ఫెస్టివల్ వాతావరణం నెలకోనేందుకు సిద్ధంగా ఉంది.
ఆ ఒక్క నెలలో బాక్సాఫీస్ వార్ రూ.3000 కోట్లు ఫిక్స్.. పోటీ మాములుగా లేదుగా..!
