పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలతో పాటు ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా కూడా లైన్లో ఉంది. ఈ మూడు సినిమాలలో ముందుగా వీరమల్లు రిలీజ్‌కు ముస్తాబు అవుతోంది. మార్చి 28 రిలీజ్ అంటున్నారు. ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ తన బ్యానర్ నుంచి తీసుకొస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు స్కై రేంజ్‌లో ఉన్నాయి.
ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయగా.. ఈ సినిమా టీజర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఇక ఈ సినిమా రిలీజ్‌పై నాగవంశీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. మార్చి 29న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో పోటీపడతారా అని ప్రశ్నిస్తే వీరమల్లు 28న వస్తుందన్న విషయం మాకు తెలియదని .. దానిపై ఇంకా క్లారిటీ రావాలని.. పవన్ సినిమా ఆ డేట్‌కు వస్తే తమ సినిమా వాయిదా వేస్తామని తెలిపారు.నాగవంశీ చేసిన కామెంట్లతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సరికొత్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. నిజంగానే హరిహర వీరమల్లు సినిమా మార్చి 28న రావడం లేదా.. అందుకే నాగవంశీ ఇలాంటి కామెంట్స్ చేశారా.. అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.