Moviesఅఖండ 2 : అఘోరా పాత్ర కోసం అక్క‌డ‌కు వెళుతోన్న బాల‌య్య‌...!

అఖండ 2 : అఘోరా పాత్ర కోసం అక్క‌డ‌కు వెళుతోన్న బాల‌య్య‌…!

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ త్వరలో హిమాలయాలకు వెళుతున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తో ఆయన చేస్తున్న తాజా సినిమా అఖండ 2 లో అఘోర పాత్ర‌కు సంబంధించిన సీన్లు షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ హిమాలయాలకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ అఘోర పాత్ర సీన్లు ఎక్క‌డెక్క‌డ షూట్ చేయాల‌నే దాని కోసం హిమాలయాలలో రెక్కీ చేసేందుకు బోయపాటి శ్రీను తన బృందాన్ని పంపించారు.‌Do you wonder how Akhanda got made?అఖండ 2 విషయంలో బోయ‌పాటి అసలు రాజీ పడడం లేదు. ఇటీవల మహా కుంభమేళాలో కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ఇప్పుడు హిమాల‌యాల‌కు వెళుతున్నారు. సినిమా షూటింగ్ జ‌రుగుతున్న కొద్ది అఖండ 2 పై ప్రేక్షకులలో అంచనాలు మరిన్ని పెరుగుతున్నాయి. అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ రోల్ చేశారు.‌ సీక్వెల్ వచ్చే సరికి హీరోయిన్ మారింది. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు.

Akhanda 2 : అఖండ 2లో బాలయ్య డైలాగ్స్ చెబితే థియేటర్ దద్దరిల్లాల్సిందే - NTV  Telugu

అఖండ 2లో సంయుక్త హీరోయిన్ కాగా… ఆది పినిశెట్టి విలన్. బోయపాటి శ్రీనుతో ఈ యంగ్ హీరోకి మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు సరైనోడు చేశారు. ఆ సినిమాలో ఆది పినిశెట్టి వైరం ధ‌నుష్ అనే విల‌న్ పాత్ర‌లో అద‌ర‌గొట్టారు. ఏదేమైనా అఖండ 2 మీద అంచ‌నాలు మామూలుగా లేవు.

Latest news