MoviesTL రివ్యూ కౌస‌ల్యా సుప్ర‌జా రామ : రొటీన్ స్టోరీతో ఎంగేజింగ్‌..!

TL రివ్యూ కౌస‌ల్యా సుప్ర‌జా రామ : రొటీన్ స్టోరీతో ఎంగేజింగ్‌..!

ఇక ప్రతివారం కూడా ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి .. అలానే ప్రముఖ ఓటీటీ ఛానల్ లో ఒకటైన ఈటీవీ విన్‌లో కూడా నిన్న రిలీజ్ అయిన సినిమా కౌసల్య సుప్రజా రామా .. కన్నడలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుందా లేదా అనేది రివ్యూలో చూద్దాం. రామ్ (డార్లింగ్ కృష్ణ) చిన్న వయసు నుంచి అమ్మాయిలు అంటేనే చిన్న చూపు చూస్తూ ఉంటారు .. అలా తన వయసు పెరిగే కొద్దీ ఆడవారి పైన ద్వేషం కూడా పెరిగిపోతూ ఉంటుంది .. అయితే తన మేనత్త కొడుకు సంతు (నాగభూషణ్) కు గర్ల్ ఫ్రెండ్ లేకుండా చేస్తూ ఉంటాడు ..Kousalya Supraja Rama ott: కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్‌  ఎక్కడంటే... | kousalya-supraja-rama-2023-ott-release-in-teluguఅయితే ఇలాంటి వ్యక్తికి శివాని (బృంద ఆచార్య) తో లవ్ లో పడతాడు . ఇక ఆ తర్వాత మగవారిదే పై చేయి ఉండాలని రామ్ మనస్తత్వం తెలుసుకొని రామ్ నుంచి శివాని దూరమైపోతుంది .. అయితే ఆ స‌మ‌యంలో రామ్ తల్లి చనిపోతుంది .. ఆ సమయంలో తన తల్లి చూసిన పెళ్లి సంబంధం అని ఎలాంటి పెళ్లిచూపులు లేకుండా ముత్తు లక్ష్మి (మీలానా నాగరాజ్) ను పెళ్లి చేసుకుంటాడు . అయితే అప్పుడే అసలైన ఆట మొదలవుతుంది . అయితే రామ్‌ నుంచి శివాని ఏ కారణంతో దూరమవుతుందో అంతకుమించిన మరి ఆటిట్యూడ్ తో ముత్తు లక్ష్మి ఉంటుంది .. ఆ తర్వాత ముత్తు లక్ష్మి తో ఎందుకు సర్దుకుపోవాలి రామ్‌లో వచ్చిన మార్పు ఏమిటి అనేది అసలైన కథ.Movie - Kousalya Supraja Rama (Kannada w. English Subtitles) - Victory  Cinemaఇక ఈ సినిమాలో ఫుల్ ట్విస్టులు పవర్ఫుల్ డైలాగులు కామెడీ సినిమాలు ఎంతో హైలెట్ గా ఉన్నాయి . ముఖ్యంగా క‌థే ప్రధానంగా తెర్కక్కించిన మూవీ .. అలాగే లింగ వివక్షను కొందరు ఎలా ప్రోత్సహిస్తారు అన్నది ఇందులో బాగా చూపించారు .. అలాగే అమ్మ జ్ఞాపకాలతో మారిన విషయాలని కూడా అద్భుతంగా చూపించాడు .. ఇక ఈ సినిమాలో హీరో ఫ్లాష్ బ్యాక్ పరిచయం చేసే సన్నివేశాలు చూసే వారికి కడుపుబ్బ నవ్వులు పోయిస్తాయి .. అదేవిధంగా దర్శకుడు శశాంక్ ప్రేక్షకుడిని ఆకట్టుక నేల సినిమాను తెర్కక్కించాడు. ఇలా మొత్తానికి కౌస‌ల్యా సుప్ర‌జా రామ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఎలాంటి అడల్ట్ సన్నివేశాలు కూడా లేవు . చూసేవారికి ఆనందం పంచుతూ యూత్ ని మెప్పించే కోణంలో తెర‌కెక్కిన‌ మంచి సినిమా.

Latest news