Moviesఎన్టీఆర్ ' దేవ‌ర 2 ' ... ఈ సారి వేరే...

ఎన్టీఆర్ ‘ దేవ‌ర 2 ‘ … ఈ సారి వేరే లెవ‌ల్‌… ఊహించని ట్విస్ట్ ఇది..!

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్‌.. యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దండయాత్ర చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన ఈ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పాన్ ఇండియా లెవ‌ల్లో మంచి క‌లెక్ష‌న్లు న‌మోదు చేసింది. దేవ‌ర సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కే ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.Devara Part 1 OTT Release Date "Telugu Movies, Music, Reviews and Latest  News"దేవ‌ర 2పై కొంత మిక్స్‌డ్ టాక్ ఉండ‌డంతో దేవ‌ర 2 విష‌యంలో కొర‌టాల చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ తో గత కొన్ని వారాలుగా అహోరాత్రులు శ్ర‌మిస్తున్నాడ‌ట‌. వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంద‌ట‌.Film «Devara: Part 2» 0000 — ACMODASIఈ లోగా ఎన్టీఆర్ వార్ 2తో పాటు ప్ర‌శాంత్ నీల్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. ఇక దేవ‌ర‌లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవర పార్ట్ 2 లో కూడా వీరి పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయి.

Latest news