మన టాలీవుడ్ మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీ… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిలో చిరంజీవి ఫుల్ లెంగ్త్ సినిమాల్లో బిజీగా ఉంటే.. పవన్ కళ్యాణ్ సినిమాలు అలాగే పాలిటిక్స్‌లో కూడా బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్స్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమాలు రిలీజ్ కి ఇపుడు రెడీగా ఉన్నాయి. ఆ రెండు సినిమాలు ఏవో కావు పవన్ నటించిన “హరిహర వీరమల్లు” అలాగే చిరు నటించిన “విశ్వంభర”.ఈ రెండు సినిమాలు ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చాయి. ఇక వీరమల్లు సినిమా ఆల్రెడీ మార్చ్ 28కి రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ డేట్‌కు రావడం కష్టమే అని.. మే కు రిలీజ్ అంటున్నారు. అయితే మే నెలకు తమ్ముడు హరిహర వీరమల్లు సినిమా షిఫ్ట్ అవుతుంటే… చిరు విశ్వంభర సినిమా కూడా మే నెలకే షెడ్యూల్ అవుతోంది.
అలా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి మే నెలలో తమ సినిమాలతో పోటీ పడితే సమ్మర్లో బాక్సాఫీస్ సమరం మాంచి హీటెక్కుతుంది అనడంలో సందేహం లేదు.
అన్న చిరుతో తమ్ముడు పవన్ పోటీకి రెడీ అవుతున్నాడా.. !
