మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ కష్టాల్లో ఉందని, ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వకపోవడంతో సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఓటీటీ వాళ్లు ఈ ప్రాజెక్టు మీద అంత ఆసక్తితో లేరని ముందు నుంచి ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక నిర్మాతలకు, ఓటీటీ వాళ్లకు సరైన డీల్ సెట్ కావడం లేదు. యూవీ వాళ్లు రు. 75 కోట్ల ఆశతో ఉన్నారు.
ఓటీటీ సంస్థలు అక్కడి వరకు రావట్లేదు. పైగా టీజర్ తుస్సుమంది. దీంతో ఓటీటీ సేల్ మరింత కష్టమైంది. ఇప్పుడు మళ్లీ భేరం మొదలైందట. రు. 60 కోట్లకు భేరం వచ్చిందట. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్వంభరకు మంచి రేటే.. కానీ యూవీ వాళ్లు రు. 70 కోట్లు అడుగుతున్నారట. హిందీ రైట్స్ రు. 38 కోట్లకు అమ్మారు. ఇది కూడా మంచి డీలే.బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్. ఇటీవల ఓ పాటని తెరకెక్కించారు. మరో పాట బాకీ ఉంది. అది కూడా పూర్తయితే… షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టేస్తారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.